RC16: రామ్ చరణ్ కోసం యానిమల్ను దించుతున్న బుచ్చిబాబు

RC16: రామ్ చరణ్ కోసం యానిమల్ను దించుతున్న బుచ్చిబాబు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్న ఆయన.. అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Bucchi Babu Sana)తో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే లాంఛనంగా  మొదలుకానుంది. అయితే.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట దర్శకుడు బుచ్చిబాబు. కేవలం స్టోరీ విషయంలోనే కాదు..యాక్టర్స్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. 

ఇప్పటికే ఈ సినిమా కోసం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను సెట్ చేసిన బుచ్చిబాబు.. మరో కీ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ ను ఫిక్స్ చేశారట. ఆ స్టార్ మరెవరో కాదు బాబీ డియోల్. ఇటీవలే యానిమల్ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాబీ సినిమా విజయంలో కీలక పాత్ర పోచించాడు. దీంతో RC16 లో తాము అనుకున్న పాత్రకు బాబీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇప్పటికే ఈ పాత్ర గురించి చర్చలు కూడా జరిగాయని, బాబీ డియోల్ కూడా వెంటనే ఒకే చెప్పాడని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. 

ఇక RC16 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూరల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.