కొత్త పార్లమెంట్లో బాలీవుడ్ నటి కంగనా..

కొత్త పార్లమెంట్లో బాలీవుడ్ నటి కంగనా..

బాలివుడ్ యాక్టర్ కంగనా రనౌత్ మంగళవారం (సెప్టెంబర్ 19) కొత్త పార్లమెంట్ వచ్చారు.  కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో  ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా ఆహ్వాని తురాలిగా ఆమె హాజరయ్యారు.  కంగనా ఆఫ్ వైల్ చీర, జట్టును వదులుగా కట్టుకొని, నలుపు రంగు సన్ గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది. కంగనా పార్లమెంట్ ఆవరణలో కారు దిగుతున్న వీడియో సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే కంగనా.. తరచూ  వివిధ రాజకీయ సమస్యలపై తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. సోమవారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కంగనా స్పందిస్తూ..  భారత రాజకీయాల్లో చాలా కాలంగా వివాదాస్పద అంశంగా మహిళా రిజర్వేషన్ ఉంది.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడం కొత్త యుగా నికి నాంది పలుకుతున్నాం అని కంగనా ట్వీట్ చేసింది.