ఒంటిపై బట్టలు లేకుండా అడవుల్లో తిరుగుతున్న స్టార్ యాక్టర్

ఒంటిపై బట్టలు లేకుండా అడవుల్లో తిరుగుతున్న  స్టార్ యాక్టర్

స్టార్ అంటేనే బ్రాండెడ్ బట్టలు, కాస్టలీ ఐటమ్స్ వాడుతూ కనిపిస్తారు. అలాంటిది ఓక స్టార్ నటుడు ఒంటిమీద నూలుపోగు లేకుండా అడవుల్లో తిరుగుతూ కనిపించారు. ప్రస్తుతం ఒంటిమీద బట్టలు లేకుండా తిరుగుతున్న ఆ నటుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ యాక్టర్ మరెవరో కాదు. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్(Vidyut Jammwal). 

శక్తి, ఊసరవెల్లి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు ఈ నటుడు. అయితే తాజాగా డిసెంబర్ 10 విద్యుత్ జమ్వాల్ పుట్టినరోజు సందర్బంగా చేసిన పనికి నెటిజన్స్ అండ్ అతని ఫ్యాన్స్ షాకవుతున్నారు. పుట్టిన రోజు సందర్భంగా హిమ‌ల‌యాలకు వెళ్లిన జమ్వాల్.. ఒంటిపై బట్టలు లేకుండా న‌గ్నంగా తిరుగుతూ కనిపించారు. అలాగే వంట చేసుకొని తింటూ గడుపుతున్నాడు. ఇందుకు సంబందించిన ఫోటోలను విద్యుత్ జమ్వాల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో క్షణాల్లో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. 

అయితే.. విద్యుత్ జమ్వాల్ అలా ఒంటిమీద బట్టలు లేకుండా హిమాలయాల్లో తిరగడానికి కారణం ఏంటంటే.. ప్రతీ సంవత్సరం కనీసం 10 రోజులైనా హిమాలయాల్లో గడుపుతుంటారట విద్యుత్ జమ్వాల్. తనకు విలాసవంతమైన జీవితం కంటే.. ఒక సాధువుగా జీవించడమంటేనే ఇష్టమని తెలిపారు. అంతేకాదు.. ప్రకృతి ప్రసాదించే ప్రతి అణువులోనూ విలాసం ఉండాలి.. అన్నిటికన్నా తనను తాను అన్వేషించుకోవడమే అసలైన తృప్తిని ఇస్తుందని ట్విట్ట‌ర్ వేదిక‌గా రాసుకోచ్చాడు విద్యుత్.