రిపోర్టుల్లో నార్మల్​..అయినా గుండెపోటు..సుస్మితా సేన్‌

రిపోర్టుల్లో నార్మల్​..అయినా గుండెపోటు..సుస్మితా సేన్‌

బాలీవుడ్‌ స్టార్‌ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ (Sushmita Sen)​ ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం వైద్యులు ఆమెకు స్టంట్​ వేశారు. ప్రస్తుతం పలు వెబ్​ సిరీస్​లు​, సినిమాలతో ఆమె బిజీగా ఉన్నారు.

తన ఫ్యామిలీలో గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో తాను ప్రతి ఆరు నెలలకోసారి పరీక్షలు చేయించుకుంటానని తెలిపింది. కానీ, తనకు గుండెపోటు రావడానికి ముందు కూడా ఇలాగే పరీక్షలు చేయించినట్టు తెలిపింది. ఆ రిపోర్టుల్లో అంతా నార్మల్​గానే ఉందని కానీ, తనకు ఇలా జరగడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. 

ప్రసెంట్ సుస్మితా సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఆర్య’(Aarya) సీజన్‌ 3 నవంబర్‌ 3 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్‌ చేస్తున్న టైంలోనే  సుస్మితాసేన్‌ గుండెపోటుకు గురయ్యారు.

ఇక అంతేకాకుండా..ఆర్య ట్రైలర్‌లో చూపించిన ఒక యాక్షన్‌ సీన్‌ను తనకి గుండెపోటు వచ్చిన నెల తర్వాత తీసినట్లు తెలిపారు. ట్రైలర్‌లో బుల్లెట్‌ తగలడంతో కిందపడి ఊపిరి తీయడానికి ఇబ్బంది పడ్డట్లుగానే ..ఇక రియల్ లైఫ్ లోను గుండెపోటుతో తాను ఇబ్బంది పడినట్లు చెప్పారు