పాకిస్థాన్ గాయకుడికి భారత పౌరసత్వం ఎలా ఇచ్చారు?

పాకిస్థాన్ గాయకుడికి భారత పౌరసత్వం ఎలా ఇచ్చారు?

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గురువారం ముంబైలోని క్రాంతి మైదానంలో వేలాది మంది ప్రజలు తమ నిరసనను తెలిపారు. వారికి మద్ధతుగా, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నటీమణి స్వరా భాస్కర్ ప్రదర్శనలో పాల్గొన్నారు. దేశంలో ఇటువంటి చట్టం యొక్క అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. కొత్త పౌరసత్వ చట్టాన్ని ఖండిస్తూ, ఇది వివిధ వర్గాల ప్రజలలో భయాన్ని పెంచుతుందని అన్నారు.

ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ దేశంలో CAA లేదా NRC అవసరం లేదు. శరణార్థులకు పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇంతకుముందే ఉంది. మీరు ఏ ప్రాతిపదికన పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమికి పౌరసత్వం ఇచ్చారో.. అలాగే హిందూ శరణార్థులకు కూడా పౌరసత్వం ఇవ్వవచ్చు కదా.. అలా ఎందుకు ఇవ్వలేరు? మీరు రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి? ముస్లింలు మాత్రమే కాకుండా దేశంలోని చాలామంది నిరుపేద ప్రజలు ఈ చట్టం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. చట్టాన్ని వ్యతిరేకించడం మరియు చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. మేం చేస్తున్న ఈ నిరసన సైద్ధాంతిక వ్యతిరేకత మాత్రమే. గాంధీజీ కూడా పలు సైద్ధాంతిక అంశాలకు సంబంధించి తన వ్యతిరేకతను తెలియజేశారు. మేము కూడా మా వ్యతిరేకతను తెలియజేస్తున్నాము. ఇది ప్రజాస్వామ్య ప్రతిపక్షంలో భాగం, ఇటువంటి నిరసనలతో సమస్య లేదు. ఈ నిరసన ప్రదర్శన హిందూ, ముస్లింలు మరియు ఇతర వర్గాల మధ్య ఐక్యతను సూచిస్తుంది. ఈ నిరసనపై వ్యతిరేకత అని ముద్ర వేయోద్దు’ అని ఆమె అన్నారు.

సవరించిన పౌరసత్వ చట్టానికి నిరసనగా క్రాంతి మైదానంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా స్వరా భాస్కర్‌తో పాటు కలిసి పాల్గొన్నారు. డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ముస్లిమేతరులకు పౌరసత్వం మంజూరు చేయడమే CAA యొక్క ముఖ్య లక్ష్యం.

For More News..

వచ్చి చాయ్‌‌ తాగి పోండి కానీ పైసల్​ అడగొద్దంటున్న కేసీఆర్ సారూ
కొడుకా నిన్ను పెంచలేకపోతున్నా: డిప్రెషన్​తో తల్లి ఆత్మహత్య
సెల్‌కు దగ్గరగా.. వైఫ్‌కు దూరంగా… భర్తలపై భార్యల కంప్లయింట్