
సిటీలో బాలీవుడ్ నటి వామిక శుక్రవారం సందడి చేశారు. స్టార్డస్ట్ ప్రెజెంట్స్ సంస్థ నిర్వహిస్తున్న ‘మిస్ సౌత్ ఇండియా యూకే’ ప్రాజెక్ట్ ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కేవలం అందాల పోటీలోనే కాకుండా దక్షిణ భారత మహిళల శక్తి, ఆత్మవిశ్వాసం, లీడర్షిప్ వంటి నైపుణ్యాలను పెంపొందించే వేదికగా పనిచేస్తుందన్నారు. – వెలుగు, హైదరాబాద్ సిటీ