బాలయ్య NBK 111లో హాట్ ఐటమ్ సాంగ్ రెడీ.. నర్గీస్ ఒంపుసొంపులతో థియేటర్లు ఊగి పోవాల్సిందే!

బాలయ్య NBK 111లో హాట్ ఐటమ్ సాంగ్ రెడీ.. నర్గీస్ ఒంపుసొంపులతో థియేటర్లు ఊగి పోవాల్సిందే!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన బాలయ్య.. ఇప్పుడు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK111 నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

బాలయ్య 111లో స్పెషల్ ఐటమ్ సాంగ్!

బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఎలిమెంట్స్‌కు కొదవ ఉండదు. పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తో పాటు స్పెషల్ ఐటమ్ సాంగ్స్ కూడా అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇదే ఫార్ములాను కొనసాగిస్తూ NBK111లో కూడా ఓ ఊరమాస్ స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలో బాలయ్యకి జోడిగా ఏకంగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని మలినేని దింపినట్లు టాక్ వినిపిస్తోంది.

‘రాక్‌స్టార్’, ‘హౌస్‌ఫుల్ 5’,  ‘మస్తీ 4’వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నర్గీస్.. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లులో కూడా కనిపించింది. ఇప్పుడు బాలయ్యతో కలిసి మాస్ బీట్‌కు స్టెప్పులేయనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

బాలయ్య ఎనర్జీ, నర్గీస్ ఒంపుసొంపులతో థియేటర్లు ఊగి పోవాల్సిందే అని అంటున్నాయి సినీ వర్గాలు. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను ఇవాళ నుండే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం. గోపీచంద్ మలినేని మాస్ టేకింగ్‌, బాలయ్య ఎనర్జీ కలిసి ఈ పాటను సినిమాకే హైలైట్‌గా నిలబెట్టే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nargis Fkhri (@nargisfakhri)

మరోసారి బాక్సాఫీస్ వద్ద గర్జన?

గతంలో బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు NBK111పై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పుడు ముంబై బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్, హీరోయిన్ వివరాలు, అలాగే బాలయ్య ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని నిర్మాత వెంకట్ సతీష్ కిలారు ‘వృద్ధి సినిమాస్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.