రామ్ చరణ్ ఇండియన్ బ్రాడ్ పిట్.. ప్రియాంక క్రేజీ కామెంట్స్

 రామ్ చరణ్ ఇండియన్ బ్రాడ్ పిట్.. ప్రియాంక క్రేజీ కామెంట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఇండియన్ బ్రాడ్ పిట్ గా అభివర్ణించింది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె నటించిన లేటెస్ట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్. రీసెంట్ గా రిలీజైన  ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్బంగా ఆమె ఓ ఇంటర్నేషనల్ మీడియాతో ముచ్చటించింది. సిటాడెల్ సినిమాకి సంబంధించి చాలా విషయాలు ఆడియన్స్ తో పంచుకుంది.

ఇందులో భాగంగా.. యాంకర్ రామ్ చరణ్ ని ఇండియన్ బ్రాడ్ పిట్ అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగింది. దానికి ప్రియాంక.. అవును ఖచ్చితంగా రామ్ చరణ్ ని ఇండియన్ బ్రాడ్ పిట్ అనొచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్ గ్లోబల్ వైడ్ ఫుల్ క్రేజ్ ను సంపాధించుకున్నాడు. అలాగే చాలా మంచి వ్యక్తి" అంటూ చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ గురించి ప్రియాంక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. దీంతో చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతన్నారు. రామ్ చరణ్ రియల్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.