పాత బంగ్లా కోసం రూ.75 కోట్లు పెట్టిన బాలీవుడ్ స్టార్.. కారణం ఏంటంటే?

పాత బంగ్లా కోసం రూ.75 కోట్లు పెట్టిన బాలీవుడ్ స్టార్.. కారణం ఏంటంటే?

బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం(John Abraham) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధూమ్ సినిమా చూసిన వాళ్లకి ఇతని గురించి బాగా తెలుస్తుంది. కండలు తిరిగిన బాడీతో హ్యాండ్సమ్ హాంక్ లా ఉంటాడు జాన్. ఆయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాల్లో సూపర్ హిట్ సినిమాలతో పాటు.. స్టర్డమ్ ను కూడా సంపాదించుకున్నాడు. అదే రేంజ్ లో డబ్బు కూడా సంపాదించాడు. కేవలం హీరోగానే కాదు.. ఇటీవల వచ్చిన సూపర్ హిట్ మూవీ పఠాన్ లో విలన్ గా చేసి ఆకట్టుకుకున్నాడు.

అయితే తాజాగా జాన్ అబ్రహం పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారణం ముంబైలో ఆయనొక బంగ్లా కొన్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. 7,722 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ బంగ్లా కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టాడట. అది కొత్త బంగ్లా కూడా కాదు.. చాలా పాతది. మరి ఈ బంగ్లా కోసం అంత ఎందుకు ఖర్చు చేశారు అనేదే అందరి డౌట్. దానికి కారణం ఇంకా తెలియలేదు. అయితే.. ఆ బంగ్లాని రేనోవేట్ చేయించి అపార్ట్మెంట్స్ గా చేస్తారా? లేక కమర్షియల్‌ బంగ్లాగా మారుస్తారా? అది కూల్చేసి కొత్త బిల్డింగ్‌ కడతాడా? అనేది తెలియాల్సి ఉంది.