నేనెక్కడున్నా మూవీ రిలీజ్‌‌‌‌కు రెడీ

నేనెక్కడున్నా మూవీ రిలీజ్‌‌‌‌కు రెడీ

సీనియర్ బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి కొడుకు మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘నేనెక్కడున్నా’. మాధవ్ కోదాడ దర్శకుడు. ‘ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్’ యాడ్‌‌‌‌తో  ఫేమ్ తెచ్చుకున్న  సశా ఛెత్రి ఇందులో హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

నవంబర్ 17న తెలుగు, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు. జర్నలిజం, పాలిటిక్స్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో దీన్ని తెరకెక్కిస్తునట్టు దర్శకుడు మాధవ్ చెప్పాడు.  మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, భాను చందర్, బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.