47 ఏళ్ల వయసులో ప్రేయసితో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో..

47 ఏళ్ల వయసులో ప్రేయసితో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ నటుడు రణ్దీప్ (Randeep Hooda) హుడా 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రియురాలు లైస్రామ్(Laishram) ను త్వరలో మ్యారేజ్ చేసుకోబుతన్నారు. లేటెస్ట్ గా తన పెళ్లి విషయాన్నీ తెలుపుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఈ నెల నవంబర్ 29న ఇంపాల్లో వివాహం జరగబోతుందని తెలుపుతూ..ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ను పోస్ట్ లో రాసారు. 

మహాభారతంలో అర్జునుడు చిత్రాంగదను పెళ్లి చేసుకున్న చోటే తాను కూడా చేసుకుంటున్నానని..కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మేము ఒక్కటి కాబోతున్నాం..మా నూతన ప్రయాణానికి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం..అంటూ సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

రణ్‌దీప్‌ హుడా 2001లో రిలీజైన 'మన్‌సూన్‌ వెడ్డింగ్‌' సినిమా ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, 'రిస్క్‌', 'కర్మ ఔర్‌ హోలీ, కాక్‌టైల్‌, జిస్మ్‌ 2,బాంబే టాకీస్‌, కిక్‌, భాగి 2, రాధే, మర్డర్ 3 వంటి మూవీస్ లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రణ్‌దీప్‌ స్వతంత్ర వీర్​ సావర్కర్ మూవీలో నటిస్తున్నారు.