Bollywood Khans: నాటు నాటు పాటకి దుమ్ములేపిన ఖాన్స్.. వీడియో చూశారా!

Bollywood Khans: నాటు నాటు పాటకి దుమ్ములేపిన ఖాన్స్.. వీడియో చూశారా!

భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ( Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ  పెళ్లి వేడుకలు మొదలైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఘనంగా  జరుగుతున్నాయి. వందల కోట్ల ఖర్చుఠీ జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. కారణం.. ఈ వేడుకలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. ఇక ఇండియా నుండి టాప్ స్టార్స్ అందరు హాజరయ్యాయారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, ధోని, రామ్ చరణ్, ఉపాసన వంటి స్టార్స్ కూడా ఉన్నారు.

ఇందులో భాగంగా శనివారం జరిగిన వేడుకల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో యావత్‌ ప్రపంచాన్ని షేక్ చేసిన నాటు నాటు (Naatu Naatu) స్పెషల్ సాంగ్ గా నిలిచింది. ఇక ఈ పాటకు బాలీవుడ్ ఖాన్స్ త్రయం డ్యాన్స్ చేసి ఆడియన్స్ ను హోరెత్తించారు. ఆస్కార్‌ అవార్డు సాధించిన ఈ సాంగ్‌కు.. షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ త్రయం తమదైన స్టైల్‌లో మాస్ స్టెప్పులు వేశారు. మధ్యలో రామ్ చరణ్ కూడా యాడ్ అయ్యి దుమ్ములేపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.