క‌రోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నటుడు అక్ష‌య్ కుమార్‌

V6 Velugu Posted on Apr 05, 2021

కరోనా వైరస్ సోకడంతో బాలీవుడ్ సిని నటుడు అక్షయ్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. నిన్న‌(ఆదివారం) ఉదయం క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. కరోనా నిబంధనల ప్ర‌కారం ఐసోలేషన్ లోకి వెళ్లానని, హోం క్వారంటైన్ లో ఉన్నాన‌ని అక్షయ్ ట్వీట్ చేశాడు. అయితే..డాక్టర్ల స‌ల‌హాతో ముందు జాగ్ర‌త్త‌గా ఇవాళ ఆస్పత్రిలో  చేరి చికిత్స తీసుకుంటున్న‌ట్లు ట్వీట్ చేశాడు.

ఆరోగ్యం బాగున్నా.. ముందు జాగ్ర‌త్త‌గా డాక్టర్లతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపిన అక్షయ్.. త్వ‌ర‌లోనే తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని తెలిపారు. అంతేకాదు అందరూ జాగ్రత్తగా ఉండాలని..కరోనా రూల్స్ పాటించాలని కోరారు.
 

Tagged Bollywood star, akshay kumar, testing, hospitalised

Latest Videos

Subscribe Now

More News