Pushpa 2: నీయవ్వ.. తగ్గేదే లే.. పుష్ప2 దెబ్బకి బాలీవుడ్ స్టార్ మూవీ వాయిదా

Pushpa 2: నీయవ్వ.. తగ్గేదే లే.. పుష్ప2 దెబ్బకి బాలీవుడ్ స్టార్ మూవీ వాయిదా

పుష్ప 2(Pushpa 2).. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ. స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Manadanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేసింది ఇటీవల విడుదలైన టీజర్. 

గంగమ్మ జాతరలో అమ్మావారి అవతారంలో పూనకాలు తెప్పించాడు అల్లు అర్జున్. ఈ టీజర్ సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవల్లో వైరల్ అయ్యింది. ఇక బాలీవుడ్ నుండి కూడా ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అదే రేంజ్ లో ఇప్పుడు పుష్ప 2పై కూడా హైప్ క్రియేట్ అవుతోంది. దాంతో.. పుష్ప 2 సినిమాకుక్ పోటీగా వచ్చేందుకు బాలీవుడ్ స్టార్స్ సైతం ఆలోచిస్తున్నారట.

అవును.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గణ్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ వంటి టాప్ హీరోలతో దర్శకుడు రోహిత్ శెట్టి సింగం అగైన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్, దీపికా పదుకొనె హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న విడుదల చేయాలనీ అనుకున్నారట మేకర్స్. కానీ, అదే రోజు అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల కానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా సింగం అగైన్ సినిమాను వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.  

అంతమంది స్టార్స్ ఉన్న సినిమాను పుష్ప 2కి భయపడి వాయిదా వేయడం అంటే మాములు విషయం కాదు. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు నార్త్ లో పుష్ప 2పై క్రేజ్ ఏ రేంజ్ ఉందొ చెప్పడానికి. కేవలం పాజిటీవ్ టాక్ వస్తే చాలు.. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. మరి ఈ రేంజ్ హైప్ తో వస్తున్న పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.