అక్టోబర్ 19న ఘోస్ట్ మూవీ రిలీజ్

అక్టోబర్ 19న ఘోస్ట్ మూవీ రిలీజ్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇలా ఒకే ఫ్రేమ్‌‌‌‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. శనివారం జరిగిన భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌‌‌‌ నేపథ్యంలో వీరిద్దరూ కలిశారు. ‘టైగర్ 3’ సినిమాను ప్రమోట్ చేస్తున్న సల్మాన్ ఖాన్,‘ఘోస్ట్’ మూవీ ప్రమోషన్స్‌‌‌‌ కోసం ముంబై వెళ్లిన శివరాజ్ కుమార్ స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో క‌‌‌‌లుసుకున్నారు. ఈనెల 19న ‘ఘోస్ట్’ రిలీజ్ కానుండగా దీపావళి సందర్భంగా నవంబర్‌‌‌‌‌‌‌‌ రెండో వారంలో ‘టైగర్ 3’ రిలీజ్ కానుంది.