అత్యాశతోనే అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్.. వరదలపై దియా మీర్జా షాకింగ్ కామెంట్స్!

అత్యాశతోనే అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్.. వరదలపై దియా మీర్జా షాకింగ్ కామెంట్స్!

వరదలతో పంజాబ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. జమ్మూ - కాశ్మీర్‌,  హిమాచల్ ప్రదేశ్ లలో కురుస్తున్న భారీ వర్షాలకు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో పంజాబ్‌ లో భయంకరమైన వరదలు పోటెత్తాయి. గురుదాస్‌పూర్, ఫాజిల్కా, కపూర్తలా, తర్న్ తరణ్, ఫిరోజ్‌పూర్, హోషియార్‌పూర్, అమృత్‌సర్ వంటి జిల్లాలు ఈ ప్రకృతి విలయాలని తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

బాలీవుడ్ స్టార్స్ రియాక్షన్స్
ఈ విపత్కర పరిస్థితిపై బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్  స్పందించారు. పంజాబ్‌లో వరదల వల్ల ప్రభావితమైన వారిని చూస్తే నా మనసు కలత చెందుతోంది. ప్రతి ఒక్కరూ నిరాశ్రయులకు అండగా నిలవాలి.  పంజాబ్ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరు. దేవుడు వారందరినీ ఆశీర్వదించుగాక  అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ... తన అధికారిక 'X' ఖాతాలో  పోస్ట్ చేశారు.

 

మరోవైపు నటి దియా మీర్జా వరదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరదలతో ప్రాణాల కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు.  "అమాయ  ప్రజలు చనిపోవడానికి కారణం అత్యాశ మాత్రమే. ఇది వరదల్లో కొట్టుకుపోతున్న జీవితాలైనా ,  దారుణంగా హత్య చేయబడుతున్న అమాయక పిల్లలైనా... ఇదంతా జరుగుతుంది ఎందుకంటే అధికారం ఉన్న కొందరు వ్యక్తులు వల్లే.  సామాజిక న్యాయం, భద్రత , శాంతి కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారంటూఅంటూ పరోక్షంగా ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దియా మీర్జా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సహాయక చర్యలు
ఈ విపత్కర పరిస్థితుల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి భారత సైన్యం తీవ్రంగా కృషి చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే 5,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  అలాగే విధుల్లో ఉన్న 300 మంది పారామిలిటరీ సిబ్బందిని రక్షించారు.  3,000 మందికి పైగా ప్రజలకు వైద్య సహాయం అందించి, 27 టన్నుల ఆహారం, నిత్యావసరాలను వరద ప్రభావిత ప్రాంతాలకు చేర్చారు.