హయ్యస్ట్‌ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ ముద్దు గుమ్మ

హయ్యస్ట్‌ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ ముద్దు గుమ్మ

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలామంది స్టార్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. అందులో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరు అనేది చెప్పడం కష్టం.   అయితే పారితోషికాన్ని అనుసరించి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ ఎవరనే విషయం తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఈ విషయంపై  ఫోర్బ్స్, ఐఎండిబి సంస్థలు ఓ జాబితాను విడుదల చేశాయి. ఇందులో దీపికా పదుకొణె టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. 

 ఒక్కో సినిమాకు ఆమె రూ.15 నుంచి 30 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. ఇక దీపిక తర్వాత సెకండ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంగన నిలిచింది. ఆమె 15 నుంచి 27 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.  మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా ప్రియాంక,  కత్రినా కైఫ్,  అలియా భట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కరీనా కపూర్,  శ్రద్ధా కపూర్,  విద్యాబాలన్,  అనుష్క శర్మ, ఐశ్వర్య రాయ్ నిలిచారు.  అయితే ఈ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్క సౌత్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా లేకపోవడం ఆశ్చర్యపరిచింది.