రివేంజ్ అంటే ఇదేనా.. బాంబు బెదిరింపు కాల్ చేసిన టీసీఎస్ మాజీ ఉద్యోగి

రివేంజ్ అంటే ఇదేనా.. బాంబు బెదిరింపు కాల్ చేసిన టీసీఎస్ మాజీ ఉద్యోగి

బెంగళూరులోని హోసూర్ రోడ్డులో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) థింక్ క్యాంపస్‌కు ఫేక్ బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇది ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసింది. బాంబు బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలియగానే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. నవంబర్ 14న ఉదయం క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు ఈ కాల్ వచ్చింది.

బాంబు బెదిరింపు కాల్ రావడంతో, పరప్పన అగ్రహార ప్రాంతంలోని పోలీసు అధికారులకు యాజమాన్యం సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసు బృందం క్యాంపస్‌ను సందర్శించింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్ సభ్యులు కాంప్లెక్స్ లోపల పేలుడు పదార్థాల కోసం వెతకడం ప్రారంభించారు. అదృష్టవశాత్తూ, తనిఖీ తర్వాత భవనం లోపల అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు. ఈ పరిణామంతో ఆ కాల్ ఫేక్ కాల్ అని గుర్తించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ పనిని టీసీఎస్ మాజీ మహిళా ఉద్యోగే ఈ చర్యకు పాల్పడ్డారని పలు నివేదికలు చెబుతున్నాయి.