కాశీ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్..

కాశీ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్..

ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని రన్ వే పైనే నిలిపివేశాడు. ఫ్లైట్ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ డోర్స్ తీసి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. బాంబు విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎయిర్ పోర్టు సిబ్బంది. పోలీసులు బాంబ్ స్క్వార్డ్ తో విమానం వద్దకు చేరుకుని తనిఖీ చేపట్టారు. విమానం లోపల బయట తనిఖీ చేసిన తర్వాత ఎటువంటి బాంబు లేదని గుర్తించారు అధికారులు. విమానం కొద్ది సేపట్లో పున:ప్రారంభించనున్నారు.