శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు..ఫేక్ కాల్గా గుర్తింపు

శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు..ఫేక్ కాల్గా గుర్తింపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలు నిలిపి బాంబ్,డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.  గంటన్నరపాటు తనిఖీలు నిర్వహించి ఎటువంటి బాంబు లేదని తేల్చారు. దీంతో ప్రయాణికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే బాంబు బెదిరింపు కాల్ తో రైల్వేస్టేషన్ లో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా సికింద్రాబాద్ నుండి త్రివేండ్రం వెళ్లే శబరి ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉన్నట్లు వచ్చిన సెల్ ఫోన్ కాల్ ను ఫేక్ కాల్ గా గుర్తించినట్లు జీఆర్పీ డీఎస్పీ నరసయ్య తెలిపారు. ఫేక్ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

సీఎం కేసీఆర్ ప్రజాసమస్యలను గాలికొదిలేశారు

దేశ ప్రధానిని కాదు.. 130 కోట్ల ప్రజలకు సేవకుడిని