పూణె పోర్షే యాక్సిడెంట్ కేసు: మైనర్ నిందితుడిని విడుదలకు బాంబే హైకోర్టు ఆదేశం 

పూణె పోర్షే యాక్సిడెంట్ కేసు: మైనర్ నిందితుడిని విడుదలకు బాంబే హైకోర్టు ఆదేశం 

పూణెలో పోర్షే కారు ప్రమాదంలో మైనర్ నిందితుడిని విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. నిందితుడైన మైనర్ ను చట్ట విరుద్ధంగా నిర్భంధంలో ఉంచారని ఆరోపిస్తూ మైనర్ ను విడుదల చేయాలని జూన్ 14 న అతని అత్త బాంబే హైకోర్టు లో హెబియస్ కార్పర్ పిటిషన్ వేసింది.మంగళవారం (జూన్25) విచారిం చిన కోర్టు.. మైనర్ విడుదల చేయాలని ఆదేశించింది.ప్రస్తుతం  17 ఏళ్ల మైనర్ నిందితుడిని పూణేలోని అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచారు. 

మే19, 2024 న పూణెలో మైనర్ నిందితుడు పోర్షే కారును వేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మే 19 తెల్లవారు జా మున 2.30 గంటలకు మద్యం మత్తులో 17 ఏళ్ల మైనర్ నిందితుడు కారును నడుపుతూ  వారిపైకి దూసుకెళ్లడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఐటీ టెకీలు స్పాట్ లోనే చనిపోయారు.

ఈ కేసులో నిందితుడిని తప్పించేందుకు తండ్రి, తాతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి తండ్రి  విశాల్ అగర్వాల్ కు జూన్ 21న పూణె జిల్లాకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడిని తప్పించి డ్రైవర్ ను ఇరికించేందుకు ప్రయత్నించిన తాతకు ఇంకా జైల్లోనే ఉన్నారు.