విడాకులు తీసుకున్నా సరే.. మాజీ భర్తకు ప్రతినెలా రూ.10 వేలు ఇవ్వండి : హైకోర్టు తీర్పు

విడాకులు తీసుకున్నా సరే.. మాజీ భర్తకు ప్రతినెలా రూ.10 వేలు ఇవ్వండి : హైకోర్టు తీర్పు

సాధారణంగా విడాకుల తర్వాత భార్యలకు భర్తలు భరణం ఇవ్వడం గురించి మనం  వింటుంటాం. తాజాగా భరణం విషయంలో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ షర్మిల దేశ్‌ముఖ్‌ ఈ నెల 2న తీర్పు చెబుతూ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం జీవిత భాగస్వామి అన్న పదం అటు భర్తకు, ఇటు భార్యకు కూడా వర్తిస్తుందని తెలిపారు. సంపాదించే మహిళ.. అనారోగ్యం, వైద్య పరమైన ఇబ్బందులతో జీవనోపాధి పొందలేని స్థితిలో ఉన్న మాజీ భర్తకు భరణం చెల్లించాలని పేర్కొంది. 

బ్యాంకు మేనేజర్‌ అయిన ఓ మహిళ తన మాజీ భర్తకు భరణం చెల్లించలేనని వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బ్యాంకులో నెలకు రూ. 65,000 సంపాదిస్తున్నందున ఆయనకు నెలకు రూ.10వేల భరణం చెల్లించాలంది.   కొన్ని వైద్యపరమైన రుగ్మతల కారణంగా తాను పని చేయలేకపోతున్నానని, అందువల్ల బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న తన మాజీ భార్య నుంచి మెయింటెనెన్స్‌ ఇప్పించాలని కోరుతూ ఆమె మాజీ భర్త వేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు స్వాగతించి విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.