
అశ్లీల చిత్రాల కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ నటి గెహనా విశిష్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేసింది. తన చేత బలంతంగా అశ్లీల చిత్రాల్లో నటించేలా చేశారని గెహనాపై మరో నటి ఫిర్యాదు చేసింది. గెహనా యాక్ట్ చేసిన సినిమాల్లో తనను కూడా నటింప జేశారని.. వాటిని మొబైల్ యాప్ హాట్‌షాట్స్ లో అప్‌లోడ్ చేశారని ఆమె ఆరోపించారు. హాట్‌షాట్స్ మొబైల్ యాప్ రాజ్ కుంద్రాకు సంబంధించినది. అయితే గెహనా తరపు లాయర్ పిటిషనర్ వాదనను తిరస్కరించారు. ఇంతకుముందు కూడా పిటిషనర్ అశ్లీల చిత్రాలలో నటించిందని, తమ దగ్గర కూడా అలాంటి విజువల్స్ లో నటించేందుకు అభ్యంతరం లేదంటూ రాసిచ్చారని తెలిపారు. అయితే ఈ కేసులో గెహనాకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.