
పినపాక, వెలుగు: మండలంలోని బొమ్మరాజు పల్లి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్‌ను మంగళవారం ఎంఈవో కొమరం నాగయ్య తిరిగి ప్రారంభించారు. 15 ఏండ్ల కింద స్టూడెంట్స్ లేక ఈ స్కూలును మూసివేశారు. ఇటీవల స్థానికంగా బడిఈడు పిల్లల సంఖ్య పెరగడంతో మూడేండ్లుగా స్కూల్‌ను రీ ఓపెన్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ క్రమంలో మంగళవారం గ్రామస్తులతో కలిసి పాఠశాలను ఎంఈవో తిరిగి ప్రారంభించారు. అధికారులు, గ్రామస్తులు కలిసి పాఠశాల ఆవరణలో పెరిగిన గడ్డి, మొక్కలను క్లీన్ చేశారు. గ్రామస్తుల ప్రయత్నాన్ని ఎంపీడీవో సునీల్ కుమార్ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో వెంకటేశ్వరరావు, టీచర్లు రామిరెడ్డి, నరసింహారావు, సతీశ్, శ్రీకాంత్, వీరభద్రం, మాజీ సర్పంచ్ మహేశ్, సీఆర్పీ గిరిబాబు, సీసీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.