వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తల్లి దీవించు అంటూ అమ్మవారికి మహిళలు బోనాలు, మొక్కులు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో బోనం తీసేందుకు సుమారు 2 గంటల సమయం పట్టింది. అమ్మవారు శాంతంగా ఉండాలని కల్లుపోసి వేడుకున్నారు.
