మహారాష్ట్రలో బొండాడ కొత్త సోలార్ ప్రాజెక్టులు

మహారాష్ట్రలో బొండాడ కొత్త  సోలార్ ప్రాజెక్టులు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌కు చెందిన బొండాడ ఇంజనీరింగ్‌‌ లిమిటెడ్ (బీఈఎల్) మహారాష్ట్రలోని హింగోలి, ధూలే, సంభాజీనగర్, జల్గావ్ ప్రాంతాల్లో  56.9 మెగావాట్స్ (ఎండబ్ల్యూ) కెపాసిటీ గల  సోలార్ ప్రాజెక్టులను  ప్రారంభించింది. పారాడిమ్​ ఐటీ, మహాజెన్​కో ఈ ప్రాజెక్టుల నుంచి కరెంట్‌‌ను సప్లయ్‌‌ చేయనుంది. ఈ ప్రాజెక్టులతో బీఈఎల్ సంస్థ మొత్తం స్థాపించిన సోలార్ సామర్థ్యం 1 గిగావాట్‌‌(జీడబ్ల్యూ) మైలురాయిని దాటింది. 

వర్షాకాల పరిస్థితుల్లోనూ తమ సోలార్ విభాగం ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేసిందని, ఇది  సంస్థ నిబద్ధతను, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుందని బీఈఎల్ పేర్కొంది. ఈ కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో  రూ.1,216 కోట్ల ఆదాయంపై  రూ.92.56 కోట్ల నికర లాభం వచ్చింది.  రూ.143.03 కోట్ల ఇబిటా (ఆపరేషనల్ ప్రాఫిట్‌‌) నమోదు చేసింది. కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ  రూ.5,989 కోట్లకు చేరుకుంది.