ఓపెన్ కాని ట్రైన్ టికెట్ బుకింగ్.. ప్లీజ్ వెయిట్: రైల్వే శాఖ ట్వీట్

ఓపెన్ కాని ట్రైన్ టికెట్ బుకింగ్.. ప్లీజ్ వెయిట్: రైల్వే శాఖ ట్వీట్

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన రైలు ప్ర‌యాణాలు మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతున్నాయి. రేప‌టి (మంగ‌ళ‌వారం) నుంచి 15 రూట్ల‌లో స్పెషల్ ట్రైన్లు న‌డిపేందుకు రెడీ అయింది రైల్వే శాఖ‌. న్యూఢిల్లీ నుంచి దేశంలోని ప‌లు మేజ‌ర్ సిటీల‌కు లిమిటెడ్ స్టాప్స్ తో రైళ్లు స్టార్ట్ చేస్తామ‌ని నిన్న ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఓన్లీ ఏసీ రైళ్ల‌ను మాత్ర‌మే న‌డిసేందుకు నిర్ణ‌యించింది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న రిజ‌ర్వేష‌న్ క‌న్ఫామ్ అయిన వాళ్ల‌కే ఈ ట్రైన్స్ లో ప‌ని చేసేందుకు అనుమ‌తి ఇస్తోంది. రిజ‌ర్వేష‌న్ లేకుండా రైలు ఎక్క‌డం కుద‌ర‌దు.

సోమ‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల నుంచి ఐఆర్సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ లో టికెట్ల బుకింగ్ చేసుకోవ‌చ్చ‌ని ఆదివారం రైల్వే శాఖ ప్ర‌క‌టించింది. కానీ 4 గంట‌ల‌కు ఆ సైట్ ఓపెన్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఆరు గంట‌ల నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతుందంటూ స్క్రీన్ పై నోటిఫికేష‌న్ క‌నిపించింది. దీనిపై రైల్వే శాఖ స్పందించింది. స్పెషల్ ట్రైన్ డేటా ను ఐఆర్సీటీసీ వెబ్ సైట్ కు అందిస్తున్నామ‌ని, టికెట్ బుకింగ్ కొద్దిసేప‌టిలోనే స్టార్ట అవుతుంద‌ని త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌యాణికుల‌కు వివ‌ర‌ణ ఇచ్చింది. ప్ర‌యాణికులు కొంచెం సేపు వెయిట్ చేయాల‌ని కోరింది.

More News:

మే 12 నుంచి ట్రైన్స్ స్టార్ట్: రైలు ప్ర‌యాణాల‌కు కేంద్ర హోం శాఖ‌ మార్గ‌ద‌ర్శ‌కాలు

క‌రెన్సీ నోట్లు, సెల్ ఫోన్స్ శానిటైజ్ చేసే మెషీన్.. హైద‌రాబాద్ లోనే త‌యారీ