వాలెట్ల వ్యాపారానికి కొత్త రూల్స్‌తో బూస్ట్

వాలెట్ల వ్యాపారానికి కొత్త రూల్స్‌తో బూస్ట్
  • బ్యాంకు ఖాతాలకు యూపీఐ అకౌంట్ల లింక్
  • కేవైసీ ఉంటేనే ఈ సదుపాయం వర్తింపు

న్యూఢిల్లీ: పేటీఎం, అమెజాన్​ పే, ఫోన్​ పే వంటి వంటి డిజిటల్ వాలెట్ల కోసం ఆర్బీఐ తాజాగా తీసుకొచ్చిన రూల్స్ వల్ల ఆయా కంపెనీల బిజినెస్‌‌‌‌‌‌‌‌ మరింత దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అకౌంట్లను వాలెట్లకు లింక్ చేసుకోవచ్చు. చెల్లింపులకు వాలెట్లోని డబ్బును లేదా బ్యాంకు ఖాతాలోని డబ్బును వాడుకోవచ్చు. వాలెట్లోని డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాలకు పంపించుకోవచ్చు.  యూపీఐ ద్వారా వాలెట్లలో డబ్బు లోడ్ చేయడానికి అనుమతించడం వల్ల వాలెట్లకు డిమాండ్ పెరుగుతుందని ఫైనాన్షియల్​  ఎక్స్​పర్టులు చెబుతున్నారు. “ఇంటర్‌‌‌‌‌‌‌‌ఆపరేబిలిటీ రావడంతో, ఒక వాలెట్ నుండి మరొక వాలెట్​కు సులువుగా డబ్బులు పంపుకోవచ్చు. బిల్ పేమెంట్స్ చేయడం సులభం అవుతుంది. ప్రస్తుతం, యూపీఐ కేవలం బ్యాంకు ఖాతాలకు మాత్రమే పరిమితం. ఇక నుంచి  ఇంటర్‌‌‌‌‌‌‌‌ఆపరేబిలిటీ వల్ల వాటిని మరిన్ని సేవలకు ఉపయోగించుకోవచ్చు”అని పీడబ్ల్యూసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మిహిర్ గాంధీ అన్నారు.

వచ్చే మార్చి వరకు డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌..
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రమెంట్స్‌‌‌‌‌‌‌‌ (పీపీఐ) సేవలు అందించే సంస్థలు 31 మార్చి 2022 నాటికి ఇంటర్‌‌‌‌‌‌‌‌ఆపరేబిలిటీకి మారాలని ఆర్బీఐ ఆదేశించింది.   అయితే పూర్తిగా కేవైసీ ఉన్న కస్టమర్లకు మాత్రమే ఇంటర్ఆపరేబిలిటీ వర్తిస్తుంది. కేవైసీ ఉన్న వారి వివరాలను బ్యాంకులు, వ్యాలెట్ ఆపరేటర్లు పరిశీలించగలుగుతారు. ఇంటర్‌‌‌‌‌‌‌‌ఆపరేబిలిటీని అనుమతించే పని 2017 లోనే ప్రారంభమైంది. ఇందుకోసం ఆర్బీఐ ఒక ప్రత్యేక విధానాన్ని తయారు చేసింది. 2018 లో గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. అయితే ఇంటర్‌‌‌‌‌‌‌‌ఆపరేబిలిటీ స్వచ్ఛందమని ప్రకటించింది. పీపీఐ కస్టమర్లంతా పూర్తిస్థాయి కేవైసీ ఇచ్చేలా ఎంకరేజ్ చేయడానికి వాటిలో బ్యాలెన్స్ లిమిట్ నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచాలని ప్రపోజ్ చేసినట్టు ఏప్రిల్ 7 న ఆర్బీఐ తెలిపింది.  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) 2016లో యూపీఐని ప్రవేశపెట్టిన తరువాత వాలెట్లకు డిమాండ్ పడిపోయింది.  బ్యాంకు ఖాతాల మధ్య నిధులను బదిలీ చేయడానికి యూపీఐ విధానం ఈజీగా ఉండటంతో చాలా మంది వాలెట్లను ఉపయోగించడం మానేశారు.  ఎలక్ట్రానిక్ వాలెట్లలో మొదట బ్యాంకు ఖాతాల నుండి డబ్బును లోడ్ చేసి, తరువాత ఉపయోగించాల్సి ఉంటుంది.  ఇది వినియోగదారులకు అంత సౌకర్యవంతంగా అనిపించలేదు.

భారీగా ట్రాన్సాక్షన్లు
2021వ ఆర్థిక సంవత్సరంలో  రూ.1.52 లక్షల కోట్ల విలువైన 400 కోట్ల ట్రాన్సాక్షన్లు వాలెట్ల ద్వారా జరిగాయి. ఇదే కాలంలో యూపీఐ లావాదేవీల సంఖ్య 2,230 వందల కోట్లు కాగా, రూ. 41 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగాయని ఆర్బీఐ తెలిపింది. యూపీఐ ద్వారా వ్యాలెట్ల లోకి డబ్బును సులభంగా లోడ్ చేయగలిగితే   వాటి వాడకం పెరుగుతుందని మిహిర్​ గాంధీ చెప్పారు. కొత్త రూల్స్ వల్ల మర్చంట్ అవుట్‌‌‌‌‌‌‌‌లెట్లలో ఇక నుంచి వాలెట్ లావాదేవీలు ఎక్కువ అవుతాయని అన్నారు.  వస్తువులకు లేదా సేవలకు డబ్బు చెల్లించటానికి ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్ లేదా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా యూపీఐని ఉపయోగించవచ్చు.  ఐసిఐసిఐ బ్యాంక్ తన వాలెట్ ‘- పాకెట్స్’కు యూపీఐ సదుపాయం కల్పించిన మొదటి బ్యాంకుగా మారింది.ఈ ప్రైవేటు బ్యాంకు తన డిజిటల్ వాలెట్‌‌‌‌‌‌‌‌ను aయూపీఐకి అనుసంధానించడానికి ఎన్సీపీఐతో కలిసి పనిచేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ డిజిటల్ ఛానల్స్  కు చెందిన విజిత్ భాస్కర్ ఈ విషయమై మాట్లాడుతూ యూపీఐ ఐడీలను డిజిటల్ వాలెట్‌‌‌‌‌‌‌‌లతో లింక్ చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, చిన్న మొత్తాల లావాదేవీల కోసం వాలెట్లలోని బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ను నేరుగా ఉపయోగించుకోగలుగుతారని అన్నారు.బ్యాంకు సేవింగ్స్ ఖాతాలను భారీ లావాదేవీల కోసం వాడుకోవచ్చని వివరించారు. ‘‘ఆర్బీఐ కొత్త రూల్స్ వల్ల యూపీఐ వాడకం మరింత పెరుగుతుంది. డిజిటల్ ఖాతాల నుండి డబ్బు చెల్లించే సదుపాయం రావడం వల్ల కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుంది’’ అని ఎన్సీపీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్  చెప్పారు.