నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రజలకు కొంగు బంగారమైన బోరంచ ఏడు వారాల జాతర గురువారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోనే ఏడుపాయల వనదుర్గ అమ్మవారి తర్వాత బోరంచ నల్ల పోచమ్మ ఏడు వారాల జాతర ఎంతో ప్రసిద్ధిగాంచింది. రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర,కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు, మేక పొటేళ్లతో, డప్పు చప్పుళ్ళ మధ్య ఆలయం చట్టు ప్రదక్షణలు చేసి మొక్కలు తీర్చుకుంటారు.
భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవంలో భాగంగా ధ్వజారోహణం, పంచామృత అభిషేకం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు.