బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఎంఎస్ డబ్ల్యూ, వెహికల్ మెకానిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 24.
పోస్టుల సంఖ్య: 542.
పోస్టులు: వెహికల్ మెకానిక్ 324, ఎంఎస్‌డబ్ల్యూ (పెయింటర్) 13, ఎంఎస్‌డబ్ల్యూ (డీఈఎస్) 205.
ఎలిజిబిలిటీ
వెహికల్ మెకానిక్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు మోటార్ వెహికల్/ డిజిల్/ హీట్ ఇంజిన్ మెకానిక్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంఎస్‌డబ్ల్యూ (పెయింటర్): పదోతరగతితోపాటు పెయింటర్ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
ఎంఎస్‌డబ్ల్యూ (డీఈఎస్): పదో తరగతితోపాటు మోటార్/ వెహికల్స్/ ట్రాక్టర్స్ మెకానిక్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 10.
లాస్ట్ డేట్: నవంబర్ 24.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.50.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, వయసు + అనుభవం, మెడికల్ స్టాండర్డ్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు bro.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
