బాస్​లు.. ఒంటరైతున్నరు

బాస్​లు.. ఒంటరైతున్నరు

‘‘ఇక ఈ ఒత్తిడిని భరించడం నా వల్ల కాదు..’’ కేఫ్​ కాఫీ డే ఫౌండర్​వీజీ సిద్ధార్థ తన ఉద్యోగులకు రాసిన ఆఖరి లెటర్ లోని వాక్యమిది. పెద్ద పెద్ద కార్పొరేట్​కంపెనీల లీడర్లు ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటూ, తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారన్నదానికి ఈ వాక్యం అద్దం పడుతోంది. ఉద్యోగులను స్ట్రెస్​నుంచి బయటపడేసేందుకు కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అందరినీ నడిపించే బాస్ లు మాత్రం ఒంటరివారే అయిపోతున్నారు.

ఒత్తిడి మరీ మించిపోతే చివరకు వారు జీవితాలను అర్ధాంతరంగా ముగించుకునేవరకూ పరిస్థితి దారి తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సీఈవోలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగిన వారు సైతం ఒత్తిడిని తట్టుకోలేక సైకియాట్రిస్టులను ఆశ్రయిస్తుండటం ఇటీవల బాగా పెరిగిందని మైండ్​ టెంపుల్ ​ఫౌండర్, ప్రముఖ సైకియాట్రిస్ట్​అంజలి చాబ్రియా వెల్లడించారు. ఇండియన్​సీఈవోలు ఒత్తిడిని అధిగమించేందుకు సైకియాట్రిస్టుల సాయం కోరడం పెరిగిందని చెప్పారు.

ఇగోను పక్కన పెడితే.. స్ట్రెస్​ పరార్​

‘సమస్య వచ్చినపుడు, పనిలో సవాలు ఎదురైనప్పుడు ఉద్యోగులు తోటివారితో మాట్లాడతారు. పరిష్కారం దొరక్కపోతే బాస్​ దగ్గరికి వెళతారు. అయితే తాము సైతం హ్యాండిల్ ​చేయలేని సవాలు ఎదురైతే.. బాస్​లు నిస్స్సహాయ స్థితిలోకి వెళ్లి కుంగిపోతారు. వారు కిందిస్థాయి వారి సహాయం కోరడానికి ఇగో అడ్డం వస్తుంది. ఈ సమయంలో  ఇగోను పక్కన పెట్టి, ఇతరుల సహాయం, సలహాలు కోరితే పరిస్థితి చక్కబడుతుంది.  తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలు రావు.. స్ట్రెస్​పారిపోతుంది” అని చాబ్రియా వివరించారు.

అనుభవాలు షేర్​ చేసుకోవాలి

ఎంట్రప్రెనూర్లపై ఒత్తిడి చాలా ఉంటుందని, వారు  టీంగా ఏర్పడి మాట్లాడుకుంటే స్ట్రెస్​ తగ్గుతుందని యాస్కెంట్​ ఫౌండేషన్ ​చైర్మన్​హర్ష్​మరీవాలా, ఫౌండర్​మారికో అంటున్నారు. ఎంట్రప్రెనూర్లు వాళ్ల అనుభవాలను పంచుకునేందుకు ప్రత్యేక ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు.

99 శాతం డిప్రెషన్​లోకే..

కుములేటివ్​ స్ట్రెస్: కంపెనీలో ప్రతి ఒక్కరూ బాస్​ హెల్ప్​ కోసం వెళ్తారు. కానీ బాస్​ ఎవరి సాయం కోరలేరు. డిప్రెషన్​ను గుర్తించకపోవడం: ఒత్తిడి డిప్రెషన్​కు దారి తీస్తుంటుంది. కార్పొరేట్​బాస్​లలో 1 శాతం మందే ఒత్తిడి జయించేందుకు ఇతరుల సాయం కోరుతున్నారు. 99 శాతం మంది డిప్రెషన్​ను అణచిపెట్టుకుంటున్నారు. సంస్థ వాల్యుయేషన్​పై ఫోకస్: కంపెనీ ఓనర్ ​లేదా స్టార్టప్ ఫౌండర్​అయితే, ఆ సంస్థ వాల్యుయేషన్స్​విషయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. స్టాఫ్​ స్ట్రెస్: కంపెనీలో ఉద్యోగుల ఇష్యూస్​ను హ్యాండిల్​ చేయడంలో ఫౌండర్లు విఫలమవుతుంటారు. ఇదీ స్ట్రెస్​కు దారి తీస్తోంది.