మాజీ కాంగ్రెస్ సభ్యుడు... ఫేమస్ బాక్సర్ బీజేపీలోకి

మాజీ కాంగ్రెస్ సభ్యుడు... ఫేమస్ బాక్సర్ బీజేపీలోకి

భారతీయ జనతా పార్టీలోకి వరుసగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్పోర్ట్స్ సెలబ్రెటీలు చేరుతున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ నుంచి బరిలో దిగితే గెలుస్తామన్న ధీమాతో  ఆ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో దక్షిణ ఢిల్లీ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ తురుపున పోటీ ఓడిపోయిన ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజీపీలో చేరారు. తాను బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తన ఎక్స్ హ్యాండీల్ లో పోస్ట్ చేశారు. ప్రజలు ఎక్కడి నుంచి కోరుకున్న నేను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. 


గత కొద్దిరోజులుగా ప్రస్తుతం హేమమాలిని ఎంపీగా ఉన్న మధుర నుంచి కాంగ్రెస్ టికెట్ ఆయనకు దక్కుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే ఆయన బీజేపీ పార్టీలో చేరుపోయారు.  హేమమాలినికి మధుర టికెట్ ఫిక్స్ అయింది. దీంతో విజేందర్ సింగ్ జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న హర్యాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా గతంలో 2019లో లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.