డేంజరస్ ప్రాడక్ట్: నెట్రోజన్ స్మోక్డ్ బిస్కట్ తిని బాలుడు మృతి

డేంజరస్ ప్రాడక్ట్: నెట్రోజన్ స్మోక్డ్ బిస్కట్ తిని బాలుడు మృతి

అది ఓ జాతర జరుగుతున్న ప్రాంతం..అంతా జాతర సంబరాల్లో మునిగి తేలుతున్నారు.. అందరిలాగే ఓ బాలుడు తన తండ్రితో కలిసి జాతరలో వచ్చాడు జాత రలో కనిపిస్తున్న కొత్తరకం బిస్కట్ ను తినిపించాలని తండ్రిని కోరాడు. తండ్రి కొడుకు కోసం ఆప్రాడక్ట్ను కొని ఇచ్చాడు..అది తిన్న ఆబాలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చూస్తుండగానే ప్రాణాలు పోయాయి. తమిళనాడులో స్థానికంగా జరిగే ఓ ఉత్సవంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

తమిళనాడులోని ఓ జాతరలో నైట్రోజన్ స్మోక్డ్ బిస్కట్ తిని బాలుడు మృతిచెందాడు.బాలుడు తిన్న ఆ బిస్క ట్ పేరు నైట్రోజన్ స్మోక్డ్ బిస్కట్.. ఇందులో నైట్రోజన్ ఆవిరి ఉంటుంది. అది మింగడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నైట్రోజన్ ఆవిరి మింగడంతో బాలుడు ఊపిరి ఆడక, పొత్తికడుపులో నొప్పి అంటూ విలవిలలాడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితంగా లేకుండా పోయింది. బాలుడు అప్పటికే మృతిచెందాడు. 

షాకింగ్ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియోలను తమిళ చిత్రనిర్మాత, రచయిత  ఒకాయన ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పొగబెట్టిన బిస్కట్ తిన్న బాలుడు ఆనారోగ్యానికి గురైన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. పొగబెట్టిన బిస్కట్లలో ఒ స్పూన్ లిక్విడ్ నెట్రోజన్ కూడా ఎంత ప్రమాదకరమో అతను తన క్యాప్షన్ లో తెలిపాడు. ప్రమాదకరమైన స్మోక్డ్ బిస్కట్ లను నిషేధించాలని డిమాండ్ చేశాడు. పోస్ట్ ను తమిళనాడు ప్రభుత్వ ట్విట్టర్ కు ట్యాగ్ చేశాడు. 

పొగబెట్టిన బిస్కట్ చాలా ప్రమాదకరం.. ఇలాంటివి తింటే హానికరం అని నిరూపించే సంఘటన ఇది..ఇలాంటివి గతంలో కూడా జరిగాయి. ఇటీవల హర్యానాలోని గురుగ్రామ్ లోని పబ్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైనదని డాక్టర్లు అంటున్నారు. 

ఏదీ ఏమైనా తల్లిదండ్రులు తమ పిల్లలను అంలాటి ఉత్పత్తులను కొనిచ్చేముందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.