
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణం చిట్టి రామవరంలోని బాదావత్ తమన్ అనే బాలుడికి చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. పతంగి కట్ కావడంతో బిల్డింగ్ మీద ఉన్న యువకులు దారాన్ని తమ వైపు లాగే క్రమంలో తమన్ కాలికి చైనా మాంజా చుట్టుకుంది. దీంతో కాలుకు తీవ్ర గాయమైంది. బాలుడిని కొత్తగూడెంలోని జీజీహెచ్‌కు తీసుకెళ్లగా సర్జరీ చేసే వైద్యులు అందుబాటులో లేకపోవడంతో దాదాపు గంటకు పైగా హాస్పటల్లోనే పడిగాపులు కాసారు.