డిఫరెంట్ లుక్‌‌‌‌లో హీరో రామ్

డిఫరెంట్ లుక్‌‌‌‌లో హీరో రామ్

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తవడంతో సోమవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 20న మాసివ్ ఎనర్జీతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ప్రకటించారు.

గడ్డం పెంచి డిఫరెంట్ లుక్‌‌‌‌లో కనిపిస్తున్నాడు రామ్. దున్నపోతును లాగుతున్నట్టు ఇంటెన్స్‌‌‌‌గా ఉన్న పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. హీరో ప్రిన్స్ నెగిటివ్ రోల్‌‌‌‌లో, ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్‌‌‌‌లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ  చిత్రాన్ని రిలీజ్ చేయ నున్నారు.