చౌటుప్పల్ లో పల్లెప్రగతి సమావేశం బహిష్కరణ

చౌటుప్పల్ లో పల్లెప్రగతి సమావేశం బహిష్కరణ
  • చౌటుప్పల్ లో పల్లెప్రగతి సమావేశం బహిష్కరణ
  • బిల్లులు చెల్లిస్తేనే పాల్గొంటామన్న అధికారపార్టీ సర్పంచులు

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐదో విడత పల్లె ప్రగతి సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు సర్పంచులు.  అధికార పార్టీ సర్పంచులు సహా అన్ని పార్టీల సర్పంచులు మీటింగ్ ను బహిష్కరించారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే పల్లె ప్రగతి  కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఇప్పటికే చేసిన పనులకు అప్పులు చేసి నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అప్పులు తీర్చలేక  కొంత మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చెప్పిందల్లా చేసుకుంటూ పోతే.. తమ పరిస్థితి కూడా అదే అవుతుందన్నారు. మునుగోడులో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నందున తమకు నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికార పార్టీ సర్పంచులు.

మరిన్ని వార్తలు..

పీవీ బయోపిక్ లో ఎవరికీ తెలియని విషయాలు

12 దేశాల్లో మంకీ ఫాక్స్..ఇప్పటి వరకు ఎన్నికేసులంటే

మహిళా ఎంపీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు