‘యూనివర్సిటీ’ మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ

‘యూనివర్సిటీ’ మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ

ఆర్ నారాయణ మూర్తి డైరెక్ట్ చేస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘యూనివర్సిటీ’. సోమవారం ఈ మూవీ టైటిల్ లోగోను బ్రహ్మానందం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘నలభై ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. ఇది 30వ సినిమా.  బ్రహ్మానందం గారు ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. విజయనగరం, పర్లాకమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. వైజాగ్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్ ఇందులో నటించారు. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలి.. కానీ విద్య ప్రైవేట్ పరం అవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సినిమా తీసా’ అని చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘35 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నారు మూర్తి. సినిమా ఆయనకు ప్రాణం. కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నారు.. కళా దర్శకులూ ఉన్నారు.. కానీ ప్రజా దర్శకుడు నారాయణ మూర్తి ఒక్కడే.  ఇప్పుడు ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ‘యూనివర్సిటీ’  తీశారు. ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’ అన్నారు.