
ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ వివాహం డాక్టర్ ఐశ్వర్యతో హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అంతేకాకుండా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్‌చరణ్, మోహన్ బాబు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు గౌతమ్ కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం బిజినెస్ పనులు చూసుకుంటున్నారు. ఇక చిన్న కొడుకు సిద్దార్థ్.. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో తాజాగా ఆయన ఏడడుగులు వేశారు.