'బ్రహ్మాస్త్ర' రికార్డ్ క్రియేట్ చేస్తుంది

'బ్రహ్మాస్త్ర' రికార్డ్ క్రియేట్ చేస్తుంది

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ టీమ్ ప్రెస్ మీట్ పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. ఈ- ప్రెస్ మీట్ లో పాల్గొన్న దర్శక ధీరుడు రాజమౌళి, కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ లు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ముఖ్యఅతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలెబ్రెట్ చేసుకుందామనుకున్నాం... భారీ ఏర్పాట్లు చేసాం... అయితే ఐదు రోజుల క్రితం పోలీసులు వచ్చి చెక్ చేసి... పర్మిషన్ ఇచ్చారు. కానీ గణేష్ నిమజ్జనం వల్ల ఈరోజు సెక్యురిటీ ఇవ్వలేకపోతున్నామన్నారని తెలిపారు. అందుకే పార్క్ హయత్ కి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. సక్సెస్ మీట్ ని మరింత గ్రాండ్ గా నిర్వహిస్తామన్న ఆయన... -చిన్నపుడు వెదురుబొంగులతో బాణాలు చేసుకుని ఆడుకునే వాళ్ళమన్నారు. వాటిలో ఏం పవర్ లేకపోయినా అదో సరదాగా గడిచిపోయిందని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం సినిమా సూపర్ పవర్స్ తో వస్తోందని... ఈ సినిమా భారత స్టోరీ అని...  ఇదొక ఎమోషన్ అని రాజమౌళి వ్యాఖ్యానించారు.

అభిమానులకి, మీడియాకి ఈ సందర్భంగా క్షమాపణల తెలియజేసుకుంటున్నామని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. వినాయకచవితి వల్ల సెక్యురిటీ ఇవ్వలేమనడంతోనే పోలీసులకి సహకరించి మేము చిన్నగా ఈవెంట్ ని చేస్తున్నామని స్పష్టం చేశారు. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి పార్క్ హయత్ కి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక మార్క్ క్రియేట్ చేసాడన్న ఆయన.... ఇప్పుడు రణ్ బీర్ కూడా తన మార్క్ ని క్రియేట్ చేస్తున్నాడని చెప్పారు.  సినిమాకోసం చాలా కష్టపడతాడని.. నీ జర్నీ ఒక్క బ్రహ్మస్త్రతో ఆగిపొదు... ఇంకా ఇంకా చాలా సాధిస్తావ్ అనుకుంటున్న అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆలియా కూడా మంచి నటి అన్న తారక్... కరణ్, రాజమౌళి కలిసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఒక్కటి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన రాజమౌళి కూడా సినిమా రిలీజ్ అయేటప్పుడు భయపడుతున్నాడన్నారు. ఇక మా నాగార్జున బాబాయ్ గురించి మాట్లాడటానికి నా ఏజ్ సరిపోదని చెప్పారు. వరల్డ్ వైడ్ గా సినిమా ఇండస్ట్రీ ప్రెజర్ లో ఉందన్న ఆయన.... మనందరం కలిసి సినిమా ఇండస్ట్రీని కాపాడాలని పిలుపునిచ్చారు.

ఈ ఈవెంట్ లో హీరో నాగార్జున కాళ్ళు మొక్కి కరణ్ జోహార్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఇప్పట్నుంచి వచ్చే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమానన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అంటూ ఇది లేదని. అంతా ఒక్కటేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించడం చాలా హ్యాపీగా ఉందని నటసామ్రాట్ అక్కినేని నాగార్జున అన్నారు. రాజమౌళి ఒక్కడే మూడేళ్లు సినిమా తీస్తాడని అనుకున్నా... కానీ ఆయాన్ కూడా నాలుగేళ్లు ఈ సినిమాని తీసాడని చెప్పారు. ఇండియన్ సినిమాలో బ్రహ్మాస్త్ర ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుందని నాగార్జున ధీమా వ్యక్తం చేశారు.