భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు

భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఉగాది వేళ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 30న సీతారాముల కల్యాణం, 31న పన్నెండేళ్ల పండగ శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరగనుంది. బుధవారం ఉదయం భద్రాద్రి మూలవరుల సన్నిధిలో ఉత్సవానుజ్ఞ, ఓంకార ధ్వజారోహణం, రక్షాబంధనం, వాస్తుహోమం చేస్తారు. ఆలయంలో సాయంత్రం దర్బారు సేవ నిర్వహించి ఆస్థాన పురోహితులతో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. యాగశాలలో శ్రీరామాయణ క్రతువు అంకురార్పణ చేస్తారు. ఈ సందర్భంగా శ్రీరామదివ్యక్షేత్రాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలకు డోలు, సన్నాయి వాయించే కేశన్న, నాగేశ్వరరావు ఎంపికయ్యారు.