
ప్రధాని సభను సక్సెస్ చేయాలి
లక్సెట్టిపేట, వెలుగు: ఈనెల 12 న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు కోరారు. బుధవారం ఎస్సారార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా మూతపడ్డ ఎరువుల ఫ్యాక్టరీని రైతుల శ్రేయస్సు కోసం నరేంద్రమోడీ తెరిపించారని అన్నారు. ఈ ప్రాంత రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పార్టీ జిల్లా ఇన్చార్జి పల్లె గంగారెడ్డి, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, టౌన్ ఇన్చార్జి రజినీష్ జైన్, టౌన్ ప్రెసిడెంట్ హరిగోపాల్‌రావు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో హాజరుకావాలి.... చెన్నూర్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభకు చెన్నూర్ నియోజకవర్గంలోని రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్లుగౌడ్ అన్నారు. మండలంలోని అంగ్రాజుపల్లిలో బుధవారం సమావేశం నిర్వహించారు. మండలం నుంచి 5వేల మందిని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మండల అధ్యక్షుడు ఆలం బాపు, నాయకులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి వివేక్ పరామర్శ
మంచిర్యాల, వెలుగు: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీజేవైఎం మంచిర్యాల టౌన్ అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణరావు కుటుంబాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. బుధవారం వారి ఇంటికి వెళ్లి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణరావు తల్లి, సోదరిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ వంగపల్లి వెంకటేశ్వర్రావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ తదితరులున్నారు.
బోథ్ లో గురుకుల క్రీడలు ప్రారంభం
బోథ్,వెలుగు: బోథ్‌లో రాష్ట్ర స్థాయి గురుకుల క్రీడలు ప్రారంభమయ్యాయి. బుధవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పోటీలను ప్రారంభించారు. ఆయా జిల్లాల నుంచి సుమారు 1, 175 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గురుకులాల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్అతీఖొద్దీన్, ఆర్సీవో స్వరూపారాణి, ఏఆర్సీవో మహేశ్వర్‌రావు, ప్రిన్సిపల్ స్వర్ణలత, ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ సంధ్యారాణి, జడ్పీ కోఆప్షన్ మెంబర్ తాహెర్ బిన్ సలాం పాల్గొన్నారు.
- భూ వివాదాలు పరిష్కరించండి
- కలెక్టరేట్ ఎదుట పేదల ధర్నా
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరించి సాగులో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. వివిధ మండలాల నుంచి రైతుల పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అసైన్డ్ చేసిన భూముల్లో రైతులు సాగు చేసుకుంటుంటే, ఫారెస్టు అధికారులు అటవీ భూముల పేరుతో అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఫారెస్ట్, రెవెన్యూ భూములపై జాయింట్ సర్వే చేస్తామని చెప్పి చేయడం లేదన్నారు. వెంటనే సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుమార్, రత్నం తిరుపతి, నాయకులు కామెర సత్యం, అశోక్, గోగర్ల లక్ష్మి, రాజన్న తదితరులు
పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు
నిర్మల్,వెలుగు: ధాన్యం కొనుగోలు కోసం పకద్బందీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధవారం రత్నాపూర్ కాండ్లిలో మంత్రి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తూకంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 192 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్ల వెంకటరామిరెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్, ధర్మాజీ రాజేందర్, ఎంపీటీసీ మహేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం...
రాష్ట్రంలో టీఆర్ఎస్ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. బుధవారం నిర్మల్ లో అంబేద్కర్ భవన్ (మాల సంఘ భవనాన్ని) ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, ముడుసు సత్యనారాయణ, మార్కొండ రాము, డాక్టర్ స్వామి, రాజేశ్వర్, నేరెళ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ఆసిఫాబాద్,వెలుగు: చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్రవీంద్ర శర్మ సూచించారు. బుధవారం స్థానికంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమామహేశ్వరి, జూనియర్ సివిల్ జడ్జి షరీన, బార్ అసోసియేషన్ప్రెసిడెంట్బోనగిరి సతీశ్‌బాబు, లాయర్లు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి,వెలుగు: చట్టాలపై అడ్వొకేట్లు అవగాహన కల్పించాలని బెల్లంపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి జి.హిమబిందు కోరారు. బెల్లంపల్లి కోర్టు హాల్లో బుధవారం జాతీయ న్యాయసేవ దినోత్సవం నిర్వహించారు. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం చేస్తామన్నారు. చట్టాల గురించి తెలియకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలన్నారు. ఈ నెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ప్రెసిడెంట్ అంకం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పులులను డిస్ట్రబ్ చేయొద్దు
కాగజ్ నగర్,వెలుగు: కాగజ్ నగర్ టైగర్ కారిడార్ లో పులులు తిరిగేందుకు, ఆవాసంగా మార్చుకునేందుకు తగిన వాతావరణం ఉండేలా అందరూ కృషి చేయాలని నేషనల్ టైగర్ కన్జర్వేటర్అథారిటీ మీ(ఎంఈఈ) టీమ్ సభ్యులు డీఎన్ సుమన్, నితిన్ కకోడ్కర్ సూచించారు. టైగర్ కారిడార్, టైగర్ రిజర్వ్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా వారు బుధవారం కాగజ్ నగర్ డివిజన్ లో వపర్యటించారు. మహారాష్ట్ర తాడోబా, అందేరి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోకి పులులు ప్రవేశిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. పులులు ఏ విధంగా రాకపోకలు సాగిస్తున్నాయి, వాటి రాకపోకలు డిస్ట్రబ్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని కవ్వాల్టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సీపీ వినోద్ కుమార్, డీఎఫ్‌వో దినేశ్‌కుమార్, ఎఫ్డీవో విజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. పులుల ట్రాకింగ్ పై ఆరా తీశారు.
కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
కాగజ్ నగర్,వెలుగు: ఎస్పీఎంలో గతంలో పనిచేసిన కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు భువనగిరి జిల్లా యదాద్రిగుట్టలో జరిగే ఏఐటీయూసీ మూడో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను బుధవారం ఆయన స్థానికంగా విడుదల చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, జీఎస్టీ రద్దు చేయాలని, పెట్రో ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్‌చేశారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.కుమార్, మండల కార్యదర్శి సత్యనారాయణ, లీడర్లు శంకర్, కిషన్, సురేశ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యం
ఆసిఫాబాద్, వెలుగు: దేశంలో, రాష్ట్రంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సేర్ల మురళి చెప్పారు. బుధవారం సాలెగుడా గ్రామంలో పలువురు యువకులు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి చాలామంది బీజేపీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో లీడర్లు కిషన్, శ్రావణ్ కుమార్, నాగోసే పాండురంగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు లిస్ట్ కరెక్ట్‌గా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్,వెలుగు: ఓటరు జాబితా కరెక్ట్‌గా ఉండాలని కలెక్టర్సిక్తాపట్నాయక్ఆదేశించారు. బుధవారం భుక్తాపూర్ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పోలింగ్ బూత్ లో ముసాయిదా ఓటరు జాబితా పరిశీలించారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ సతీశ్, కౌన్సిలర్ ప్రకాశ్, హెచ్ఎం భిక్కుసింగ్లు తదితరులు ఉన్నారు.
అధికారులు రాకపోతే సమస్యల పరిష్కారం ఎట్ల?
లక్సెట్టిపేట, వెలుగు: మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాలకు అధికారులు రాకపోతే సమస్యలు ఎట్ల పరిష్కారం అవుతాయని సభ్యులు మండిపడ్డారు. బుధవారం మండల పరిషత్ హాల్లో ఎంపీపీ అన్నం మంగ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. అధికారులు హాజరుకావడం లేదని ఉపాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి సిబ్బందిని పంపడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. జండా వెంకటాపూర్ పంచాయతీలోని తలమల వద్ద భగీరథ పైపులు పగిలిపోయాయని, జీపీ నిధులతో రిపేర్లు చేస్తామని చెప్పినా అధికారులు స్పందించడం లేదని సర్పంచ్ ఎల్తపు సునీత అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులను సరిగా చూడడం లేదన్నారు. కాగా.. మండలంలో 18 గ్రామపంచాయతీలు ఉండగా, మీటింగ్‌కు మిట్టపల్లి సర్పంచ్ కోడి రాణి, జెండావెంకటాపూర్ సర్పంచ్ ఎల్తపు రాణి ఇద్దరే హాజరయ్యారు.