ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కేసీఆర్ సభను విజయవంతం చేయండి: ఎమ్మెల్యే రవిశంకర్​

గంగాధర, వెలుగు: జగిత్యాల జిల్లాలో రేపు నిర్వహించే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ కోరారు. సోమవారం గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన ఇంట్లో ఆరు మండలాల లీడర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేసి కేసీఆర్ సభను సక్సెస్​ చేయాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు వీర్ల వెంకటేశ్వర్​రావు, కొండగట్టు ఆలయ డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

బండి యాత్రను సక్సెస్​ చేద్దాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ

జగిత్యాల, వెలుగు: కరీంగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను జగిత్యాలలో విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ మండలాధ్యక్షుడు నలువాల తిరుపతితో కలిసి నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసు కోవడానికి, పార్టీని గడప గడపకు పరిచయం చేయడమే లక్ష్యంగా బండి పాదయాత్ర చేస్తున్నారన్నారు. సత్వరమే పార్టీ బూత్ స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలని, ప్రతి బూత్ నుంచి వంద మంది ప్రజలను యాత్రలో భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్, తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి గంగారాం లీడర్లు పాల్గొన్నారు. 

సీఎం సారూ .. మమ్మల్ని ఆదుకోండి
ప్లకార్డులతో కొండగట్టు బాధితుల నిరసన

కొడిమ్యాల, వెలుగు: కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోయి నాలుగేండ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆదుకోలేదని, తమకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించాలని సోమవారం బాధితుల కుటుంబీకులు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. వీరికి కొడిమ్యాల బీజేపీ లీడ్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు అధికార పార్టీ లీడర్లు బాధిత కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని, ఆదుకుంటామని చెప్పారని, నాలుగేళ్లు గడుస్తున్నా తమ బాధలు ఎవ్వరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాధితులు గోలి మధు, పుండ్ర అమర్నాథ్​రెడ్డి, గోల్కొండ రాజు, సురుకంటి సంజీవ్ రెడ్డి, ప్రవీణ్, సుభాన్ తదితరులు ఉన్నారు.  

బాధితులను పరామర్శించని సీఎం జగిత్యాలకా?

కోరుట్ల: నాలుగేండ్లయినా కొండగట్టు బాధితులను పరామర్శించని సీఎం కేసీఆర్​ ఇప్పుడు జగిత్యాల జిల్లాకు రావడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ లీడర్ జువ్వాడి  కృష్ణారావు అన్నారు. సోమవారం కోరుట్ల లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో ముత్యంపేట చక్కర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని నడిపిస్తామని చెప్పి మర్చిపోయారన్నారు. పేదలకు డబుల్ ఇండ్లు,  నిరుద్యోగ భృతి, బడుగులకు పోడు భూముల సమస్య పరిష్కరించలేదన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండల, పట్టణ, బ్లాక్​ అధ్యక్షులు రాజం, గంగాధర్, సత్యనారాయణ తదితనేలే పాల్గొన్నారు.

కొలువుల జాతర ఓ బూటకం

పెగడపల్లి,వెలుగు: రాష్ట్రంలో హామీలకు మించి ఉద్యోగ భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని జగిత్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మరిపెల్లి సత్యం పేర్కొన్నారు. సోమవారం పెగడపల్లిలో మండల శాఖ అధ్యక్షుడు కొమురెల్లి తో కలిసి ఆయన మాట్లాడారు. బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో 1,92,626 కొలువులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 8 ఏళ్లలో 2 లక్షల 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో లీడర్లు మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్​ పాలన అస్తవ్యస్తం: బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ ప్రతాప రామకృష్ణ

సిరిసిల్ల టౌన్, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ ప్రతాప రామకృష్ణ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో సోమవారం రగుడు చౌరస్తా నుంచి పెద్దూరు మీదుగా కార్యకర్తలతో నిర్వహించిన బీజేపీ భరోసాలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్​ఎస్​ పాలనలో ప్రజల కష్టాలు తీర్చేందుకే బీజేపీ యాత్ర నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ ఇన్​చార్జి మోహన్​రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, టౌన్​ ప్రెసిడెంట్ అన్నల్​దాస్ వేణు, నాయకులు పాల్గొన్నారు. 

బహిరంగ సభను సక్సెస్ చేద్దాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి 

కరీంనగర్ టౌన్, వెలుగు: డిసెంబర్​16న కరీంనగర్ లో జరిగే బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ పట్టణం జ్యోతినగర్ లోని ఎంపీ బండి సంజయ్ ఆఫీస్  లో నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో బహిరంగ సభ పోస్టర్ ను కృష్ణారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. త్వరలో కరీంనగర్ లోకి ప్రవేశించే ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు బీజేపీ శ్రేణులంతా తరలి రావాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాలకు జైత్రయాత్రగా వెళ్దాం: ఎమ్మెల్యే రమేశ్​బాబు

వేములవాడ, వెలుగు: జగిత్యాలలో నిర్వహిస్తున్న సీఎం సభకు వేములవాడ నుంచి వేల సంఖ్యలో తరలివెళ్లాలని ఎమ్మెల్యే సీహెచ్.​రమేశ్​బాబు  పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కథలాపూర్, మేడిపల్లి ప్రజలు ప్రధానమైన సాగు నీటి సమస్యపై సీఎం ద్వారా శుభవార్తతో పాటు గ్రామాలకు నిధులు వచ్చే శుభవార్త వింటారని చెప్పారు. కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తోందికానీ సెస్ ను చేయలేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు , జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి,  ఎంపీపీలు వజ్రమ్మ, లావణ్య, జడ్పీటీసీలు ఏశవాణి, రవి తదితరులు పాల్గొన్నారు.  

గీతా జయంతి ఉత్సవాల ముగింపు

వేములవాడ, వెలుగు:  వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న గీతా జయంతి ఉత్సవాలు పూర్ణాహుతితో సోమవారం ముగిశాయి. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ స్థానాచార్యులు భీమాశంకర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.  నాగిరెడ్డి మండపంలో హోమం జరిపారు. సంస్కృత పాఠశాల విద్యార్థులు భగవద్గీత పారాయణం చేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ తిరుపతిరావు ఆలయ ఇన్​స్పెక్టర్ అశోక్ పాల్గొన్నారు.  


మల్లన్నకు పట్టు వస్త్రాల సమర్పణ

జమ్మికుంట, వెలుగు : పట్టణ శివారులోని దుబ్బ మల్లికార్జునుడికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పట్టు వస్ర్తాలు సమర్పించారు. సోమవారం మల్లన్న ఆలయంలో నిర్వహించిన పట్నాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒగ్గు పూజరులు ఈటలను సత్కరించి, భుజాలపై ఎత్తుకున్నారు. 

మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ

దుబ్బ మల్లికార్జున స్వామిని ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి సోమవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందరి సహాకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆయా కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్​ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్​శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్​ చైర్మన్ రాజేశ్వర్​రావు, జెడ్పి చైర్ పర్సన్​ విజయ, లీడర్లు పాల్గొన్నారు.

ఒలింపియాడ్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

కొత్తపల్లి,వెలుగు: ట్రినిటి కాలేజీల ఆధ్వర్యంలో రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ నిర్వహించ నున్నట్లు చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి సొమవారం తెలిపారు. గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా డిసెంబరు 22న పరీక్ష ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కాలేజీల అకడమిక్ డైరెక్టర్స్, డీన్, వివిధ బ్రాంచీల ప్రిన్సిపాల్స్ తో కలిసి పోస్టర్​ఆవిష్కరించారు. ఒలింపియాడ్ లో మంచి మార్కులు సాధించిన వారికి నగదు బహుమతులు 
అందజేస్తామన్నారు. 

‘ధరణి’తో దొరలే లాభపడుతుండ్రు
ఆధికారంలోకి రాగానే రద్దు చేస్తాం
కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ హన్మంతరావు

రాజన్నసిరిసిల్ల, వెలుగు : ‘ధరణి పేరు బాగుంది గానీ ధరణి అంటే దెయ్యంలాగా కనిపిస్తోంది. ధరణి వల్ల ఎవ్వరన్నా లాభపడ్డరంటే అది దొరలు మాత్రమే. పేదలు మాత్రం తమ భూములు కోల్పోతున్నరు.’ అని కాంగ్రెస్ సీనియర్ లీడర్​హన్మంతరావు వ్యాఖ్యానించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టరేట్ ను  ముట్టడించారు. ఈ సందర్భంగా వీహెచ్​మాట్లాడుతూ కీసరలో 94 ఎకరాలు 10 మంది పేద రైతులకు ఇవ్వగా ధరణిని అడ్డంపెట్టుకుని వారు చనిపోయారని చెప్పి దొరలు ఆ భూమిని తమ పేరు మీదికి  మార్చుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేస్తామన్నారు. ధర్నాలో డీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వేములవాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి ఆది శ్రీనివాస్, వనిత, శ్రీనివాస్, లీడర్లు పాల్గొన్నారు.  

షుగర్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాలి

జగిత్యాల:  రాష్ట్రంలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతు సమస్యలపై ధర్నా చేశారు. అంతకుముందు స్థానిక ఇందిరా భవన్ నుంచి కాంతిభవన్, టవర్ సర్కిల్ మీదుగా తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్ చౌరస్తా వద్ద బైఠాయించి, నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ  రైతుబంధుతోపాటు రాయితీలన్ని పునరుద్ధరించాలని, పసుపు పంటకు గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షడు లక్ష్మణ్​కుమార్, నాగ భూషణం, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు.