పెళ్లికొడుకు మెళ్లో మాల వేసేందుకు పెళ్లికూతురి తంటాలు

పెళ్లికొడుకు మెళ్లో మాల వేసేందుకు పెళ్లికూతురి తంటాలు

పెళ్లి వేడుకల్లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూనే ఉంటాం. అలాంటివి గుర్తు చేసుకున్నపుడల్లా మన మధ్య కూడా అలాంటి సంఘటన జరిగితే ఎలా ఉంటుందోనని కాసేపు చర్చ కూడా చేస్తాం. అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివాహతంతులో భాగంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒకరి మెడలో ఒకరు పూలమాల వేసుకోవడం ఆనవాయితీ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అలాంటి సందర్భంలో జరిగిన సన్నివేశమే ఇది.

పెళ్లి కూతురు, వరుని మెడలో మాల వేసేందుకు ఎన్నో తంటాలు పడింది. కారణం ఏంటంటే.. వరుడు ఆమె కన్నా చాలా పొడవుగా ఉండడమే. ఆమె 3,4 సార్లు ప్రయత్నించి, ఫైనల్ గా అతని మెడలో మాలను వేసింది. ఆ సమయంలో అక్కడ జరిగిన సన్నివేశాన్ని చూస్తే నవ్వునాపుకోవడం కష్టమే. ఇక ఆ తర్వాత పెళ్లి కొడుకు వంతు రాగానే.. చాలా ఈజీగా వధువు మెళ్లో మాలను వేయడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Kant (@ravikant87870)