లింగంపేట మండలంలో వంతెన మరమ్మతులు షురూ

లింగంపేట మండలంలో వంతెన మరమ్మతులు షురూ

 లింగంపేట, వెలుగు: మండలంలోని ఐలాపూర్ గ్రామ శివారులోని వంతెన మరమ్మతు పనులను  మంగళవారం  కాంగ్రెస్​  మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్ ప్రారంభించారు. ఆగస్టు  చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనకు మొరం వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు ఆదేశించడంతో పనులు చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు మొకిరె బైరయ్య, మామిడి సంగయ్య, రాజు, నగేశ్​ తదితరులు పాల్గొన్నారు.