ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

సూర్యాపేట, వెలుగు:  బీజేపీ నియోజకవర్గ శక్తి కేంద్ర బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి  సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసానికి చేరుకున్న ఆయనను శాలువాతో సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, లీడర్లు కర్నాటి కిషన్, మన్మధ రెడ్డి, హాబీబ్, సంధ్యాల సైదులు 
తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప మాల ధారణతో ఆత్మవిశ్వాసంమంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు: అయ్యప్ప మాలధరణతో ఆధ్యాత్మికతతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయ్యప్ప సన్నిధిలో ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మహా  పడిపూజా మహోత్సవంలో మంత్రి  ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్​చైర్మన్​వట్టె జానయ్య యాదవ్​తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,  మున్సిపల్ వైస్ చైర్మన్ కిషోర్,  ఆలయ కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. 

మహాపడి పూజలో  బండి సంజయ్​, ఈటల

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా  భువనగిరిలో జరిగిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ పాల్గొన్నారు. బీజేపీ లీడర్​ జిట్టా బాలక్రిష్ణారెడ్డి భువనగిరిలోని తన ఫామ్​హౌజ్​లో  పడిపూజ నిర్వహించారు. ఈ పూజకు హాజరైన బండి సంజయ్​, ఈటల రాజేందర్​ కలశ పూజలు నిర్వహించడంతో పాటు స్వామి వారికి పూజలు  చేసి హారతి ఇచ్చారు.   బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ పాల్గొన్నారు. 

ఉచిత  వెటర్నరీ క్యాంపులు వినియోగించుకోవాలి

నేరేడుచర్ల, వెలుగు: వ్యవసాయ మార్కెట్ కమిటీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య  శిబిరాలను పశువుల పెంపకందారులు వినియోగించుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం మండలంలోని బూర్గులతండా గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని జడ్పీటీసీ రాపోలు నర్సయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 గర్భకోశ సమస్యలు ఉన్న పశువులకు చికిత్స చేయడంతో పాటు 25 దూడలకు నట్టల మందు తాగించినట్లు తెలిపారు.  పశువైద్యాధికారులు రవినాయక్, శ్రీనివాస రెడ్డి, నాగేంద్ర, శ్రీకాంత్, నేరేడుచర్ల ఏడీ శంకర్​రావు, సిబ్బంది నర్సింహాచారి, భాస్కర్, స్వప్న, తదితరులు 
ఉన్నారు.

బునాదిగాని కాల్వ పూర్తయితే రైతులకు మేలు

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు: అసంపూర్తిగా నిలిచిపోయిన బునాదిగాని కాలువ పనులును ప్రభుత్వ విప్  గొంగిడి సునీత మంగళవారం యాదాద్రి జిల్లా ఆత్మకూర్​ (ఎం)లో  తన సొంత ఫండ్స్​తో పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ప్రారంభమైన పనులు మధ్యలోనే ఆగిపోయాయని, సీఎం కేసీఆర్​, సంబంధిత శాఖా మంత్రితో మాట్లాడి ప్రారంభిస్తున్నానన్నారు. కాల్వ పనులు పూర్తయితే మండలం మొత్తం సాగునీరంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. 

 స్టూడెంట్లను అన్నింటిలో తీర్చిదిద్దండి

స్టూడెంట్లు చదువుతో పాటు అన్ని రంగాల్లో మెరుగ్గా రాణించేలా స్కూల్ స్టాఫ్ స్పెషల్ కేర్ తీసుకోవాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆదేశించారు. మోటకొండూర్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల స్కూల్​ను మంగళవారం ఆమె విజిట్​చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి స్టూడెంట్లతో కలిసి లంచ్ చేశారు. అనంతరం స్టూడెంట్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువులోనే కాకుండా స్టూడెంట్లు ఆటపాటల్లోనూ ప్రతిభను పెంచుకోవాలన్నారు. టీచర్లు స్టూడెంట్లలోని ప్రతిభను గుర్తించి ఆ దిశగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. మోటకొండూరు జడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ అల్లారి జ్యోతి, స్కూల్ టీచర్లు   
పాల్గొన్నారు. 

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​ రావు 

మిర్యాలగూడ, వెలుగు : ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్నామని  ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావు అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని  ఆయా స్కూళ్లలో ‘మన ఊరు మన బడి’ స్కీం కింద చేపట్టనున్న నిర్మాణ  పనులకు మున్సిపల్​  చ చైర్మన్​తిరునగర్ భార్గవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా  70 స్కూళ్లు ఎంపిక కాగా , ఫండ్స్​రూ. 40.68 కోట్లు శాంక్షన్​ అయ్యాయని చెప్పారు. స్కూళ్లలో ఫర్నీచర్​, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్​, ఇతర సౌలత్​లు కల్పిస్తామని తెలిపారు.  

రైతు సమస్యలు పరిష్కరించాల్సిందే 

యాదాద్రి/ నల్గొండ అర్బన్/ హుజూరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  మంగళవారం యాదాద్రి, నల్గొండ కలెక్టరేట్లు, హుజూర్​నగర్ ఆర్డీవో ఆఫీస్​ఎదుట  బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  యాదాద్రి కలెక్టరేట్​ఎదుట జరిగిన ధర్నాలో  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​టీఆర్ఎస్​ఎమ్మెల్యేల అక్రమాలపై నిప్పులు చెరిగారు. శేఖర్​రెడ్డి  తన భూముల్లో నుంచి ట్రిఫుల్ఆర్ వెళ్తున్న అలైన్​మెంట్​మార్పించి  పేద రైతుల భూములు పోయేలా కుట్ర చేశారని ఆరోపించారు.

శేఖర్​రెడ్డి భూములతో పాటు ఆయన బంధువుల భూములపై వైట్​పేపర్​రిలీజ్​చేయాలని డిమాండ్​చేశారు. నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రైతు రుణమాఫీతో పాటు ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రిలో బీజేపీ స్టేట్​వైస్​ ప్రెసిడెంట్​ కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, పడాల  శ్రీనివాస్,  నల్గొండలో గోలి మధుసూదన్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు  పాల్గొన్నారు. 

లాంగ్​జంప్​ దూరాన్ని తగ్గించాలి

సూర్యాపేట, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో ఫిజికల్​టెస్టుల్లో లాంగ్ జంప్ కొలత తగ్గించి,  అర్హత కోల్పోయిన అభ్యర్థులకు పరీక్షల్లో ప్రవేశం కల్పించాలని మంగళవారం అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు కు డీవైఎఫ్​ఐ జిల్లా కమిటీ తరఫున వినతి పత్రం  ఇచ్చారు.  ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా  అధ్యక్షుడు కాసాని కిషోర్ మాట్లాడుతూ  దేశంలో  ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో లాంగ్ జంప్ 3.8 మీటర్ల నుంచి 4 మీటర్లకు, షాట్​ఫుట్ 5.6 మీటర్ల నుంచి 6 మీటర్లకు పెంచారని తెలిపారు. దీని వల్ల ఎంతో మంది క్వాలిఫై కాలేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే  జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎండీ జహంగీర్,  జెమినీ ఎల్లయ్య, వెంకట్ పాల్గొన్నారు.

నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

సూర్యాపేట, వెలుగు: గవర్నమెంట్​స్కూల్​టీచర్లు స్టూడెంట్లకు సబ్జెక్టులతో పాటు నైతిక విలువలతో కూడిన విద్యనందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్​లో ‘తపస్’ న్యూ ఇయర్​క్యాలెండర్ ను కలెక్టర్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలు ఎక్కువగా గవర్నమెంట్​స్కూళ్లలోనే చదువుతున్నారని అందుకే ప్రభుత్వం  అన్ని సౌలత్​లు కల్పిస్తోందన్నారు. డీఈవో అశోక్, టీపీయూఎస్​జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  సంధ్యారాణి,  రమేశ్, రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ పాల్గొన్నారు.

వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలి కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి                 

నకిరేకల్, వెలుగు: ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని  కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి డాక్టర్లను ఆదేశించారు. మంగళవారం నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వాస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగం, టీహబ్​ ల్యాబ్​ను పరిశీలించి టెస్టుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి నెల సరాసరి 1200 టెస్టులను టీహబ్​డయాగ్నస్టిక్​కేంద్రానికి పంపుతున్నట్లు వైద్యాధికారులు  కలెక్టర్​కు వివరించారు. పీడియాట్రిక్, గైనిక్ వార్డుల పై కప్పు పెచ్చులు ఊడి, లీకేజీలను గమనించిన కలెక్టర్ ​రిపేర్​ ఫండ్స్​ శాంక్షన్​ కోసం ప్రపోజల్స్​పంపాలని ఆఫీసర్లను ఆదేశించారు. 3నెలలుగా డ్యూటీకి డుమ్మా కొడుతున్న గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞారెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కలెక్టర్​ఆదేశించారు. అనంతరం వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని  పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. డీసీహెచ్​ఎస్​డా.మాతృ , ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనాథ్ నాయుడు  ఉన్నారు.

సహజ వ్యవసాయంతోనే భూమికి బలం

గరిడేపల్లి, వెలుగు: సహజ వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా  భూమి  సారవంతమవుతుందని,  దీంతో ఆరోగ్యవంతమైన పంటలు పండించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ‘రైతు నేస్తం’ వ్యవస్థాపకుడు, పద్మ శ్రీ డాక్టర్​యడ్లపాటి వెంకటేశ్వర్ రావు అన్నారు. మంగళవారం గడ్డిపల్లి కేవీకేలో సహజ వ్యవసాయం పై ఏర్పాటు చేసిన  కార్యక్రమానికి హాజరై సహజ ఉత్పత్తుల ప్రదర్శన ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి రైతు కొద్ది మొత్తంలో సహజ వ్యవసాయాన్ని చేస్తూ పంటలు పండించుకోవాలని సూచించారు.  ప్రస్తుతం సహజ ఉత్పత్తులకు మంచి మార్కెట్ కూడా ఉన్నదని చెప్పారు.  ఆర్ఎస్ఎస్ గో సేవా విభాగ్ మదన్ గుప్తా, కేవీకే ఇన్​చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లవకుమార్, జిల్లా వ్యవసాయ అధికారి డి రామా రావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న నిర్వాసితుల ఆందోళన

     మరింత  టైం కోరిన కలెక్టర్​ పమేలా సత్పతి

యాదాద్రి, వెలుగు:  జిల్లాలో బస్వాపురం నిర్వాసితుల ఆందోళన  28వ రోజు మంగళవారం కూడా కొనసాగింది.  తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వక పోవడం, ఇల్లు కూడా సరిగా లేక పోవడంతో పిల్లను ఇవ్వడానికి ఎవరూ వస్తలేరన్న మనస్తాపంతో ఆదివారం రాత్రి బాలస్వామి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆఫీసర్ల నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పరిహారం సొమ్ము బ్యాంకు ఖాతాలో వేసే వరకూ ఆందోళన విరమించేది లేదని నిర్వాసితులు స్పష్టం చేశారు. కాగా పరిహారం విషయంలో మంగళవారం స్పష్టత ఇస్తామని చెప్పిన కలెక్టర్​ పమేలా సత్పతి మరో వాయిదా కోరినట్టు తెలిసింది. ఈ నెల 30న యాదగిరిగుట్టకు రాష్టపతి ద్రౌపది ముర్ము వస్తున్న కారణంగా వాయిదా కోరినట్టుగా సమాచారం.  

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​ రావు 

మిర్యాలగూడ, వెలుగు : ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్నామని  ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావు అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని  ఆయా స్కూళ్లలో ‘మన ఊరు మన బడి’ స్కీం కింద చేపట్టనున్న నిర్మాణ  పనులకు మున్సిపల్​  చ చైర్మన్​తిరునగర్ భార్గవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా  70 స్కూళ్లు ఎంపిక కాగా , ఫండ్స్​రూ. 40.68 కోట్లు శాంక్షన్​ అయ్యాయని చెప్పారు. స్కూళ్లలో ఫర్నీచర్​, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్​, ఇతర సౌలత్​లు కల్పిస్తామని తెలిపారు.