తెలంగాణకు వచ్చే దేశ, విదేశీ ప్రతినిధులకు ప్రోటోకాల్ తెస్తున్నం : మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి 

తెలంగాణకు వచ్చే దేశ, విదేశీ ప్రతినిధులకు ప్రోటోకాల్ తెస్తున్నం : మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి 

కామారెడ్డి, వెలుగు:  ఎక్కడైతే మన అస్థిత్వం లేకుండా  ఆంధ్రా పాలకులు చేశారో.. అక్కడే  తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని నిర్మించుకున్నామని  ఆర్ అండ్​బీ  శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి  చెప్పారు.   శనివారం  కామారెడ్డి కలెక్టరేట్​లో  జిల్లా  ప్రజాప్రతినిధులు,  ఆఫీసర్లతో  దశాబ్ది ఉత్సవాలపై  ఆయన రివ్యూ నిర్వహించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మన రాష్ర్టానికి  దేశ, విదేశాల నుంచి ప్రెసిడెంట్లు, సీఎంలు, ఇతర ప్రతినిధులు ఎవరు వచ్చినా  మొదటగా తెలంగాణ అమరుల స్మారకాన్ని  దర్శించుకునేలా ప్రోటోకాల్​ రూపొందించనున్నట్లు తెలిపారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ   కేసీఆర్​ నాయకత్వంలో   9 ఏండ్లలో  ఎన్నో   అద్భుతాలు సృష్టించిందన్నారు.  అన్ని రంగాల్లో  దేశంలోనే నంబర్​ వన్​గా నిలిచిందన్నారు.  ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు అంతా కలిసి దశాబ్ది ఉత్సవాలు సక్సెస్​ చేయాలన్నారు.  సమీక్షలో  విప్​ గంప గోవర్ధన్​,  జడ్పీ చైర్​పర్సన్​ దఫేదర్​ శోభ,  జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​,   ఎమ్మెల్యేలు   హన్మంతుషిండే,  జాజాల సురేందర్​, కలెక్టర్​  జితేష్​ వీ  పాటిల్​,  అడిషనల్ కలెక్టర్​ వెంకటేశ్​దొత్రే, ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి,  మున్సిపల్ చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.