నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..తండ్రీకూతురు మృతి

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..తండ్రీకూతురు మృతి

నిర్మల్ జిల్లాలో మే 11న తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది.  నీలాయిపేట గ్రామంలో   బైపాస్ దగ్గర ఐచర్ వాహనాన్ని  ఢీ కొట్టింది కారు.  ఈ ఘటనలో   కారులో  ప్రయాణిస్తున్న  తండ్రీకూతురికి తీవ్రగాయాలు కావడంతో  అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. కారు నుజ్జనుజ్జ అయ్యింది. ఈ ప్రమాదంతో హైవేపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  మృతులు తండ్రి  ఆశోక్(45),  కూతురు కృతిక(20) స్వస్థలం ఆదిలాబాద్ గా గుర్తించారు. గాయాలైన డ్రైవర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  అతివేగంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు.