రష్యా వ్యాపార వేత్త జెట్ విమానాన్ని అడ్డుకున్న బ్రిటన్

 రష్యా వ్యాపార వేత్త జెట్ విమానాన్ని అడ్డుకున్న బ్రిటన్

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రపంచంలో అనేక దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఆంక్షలు విధించిన బ్రిటన్ దూకుడు పెంచుతోంది. ఉక్రెయిన్ కు ఇప్పటికే అన్ని విధాల అండగా నిలుస్తున్న బ్రిటన్.. రష్యాకు చెందిన వ్యాపార వేత్తలు తమ దేశంలో స్వేచ్చగా విహరించడాన్ని చూసి సహించబోమని ప్రకటించింది. తాజాగా శనివారం లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ కు సిద్ధమైన ప్రైవేటు జెట్ ను అడ్డుకుని నిలిపేసింది. ఈ విషయాన్ని బ్రిటన్ రవాణాశాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో అనేక మంది అమాయకులు రక్తం చిందిస్తూ ఉంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకారంతో కోట్లు సంపాదించుకున్న వ్యాపారవేత్తలు శాంతియుతంగా స్వేచ్ఛగా గడుపుతుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికే రష్యాకు చెందిన ఓ వ్యాపార వేత్తకు చెందిన రెండు ప్రైవేట్ జెట్ విమానాలను సీజ్ చేసిన బ్రిటన్.. తాజాగా ఇవాళ మరో జెట్ ను అడ్డుకుంది. 

 


 

మైకోలైవ్ దాడి ఘటనలో 33కు చేరిన మృతులు
మైకొలైవ్ పట్టణంలోని పరిపాలనా భవనంపై గత మంగళవారం రష్యా జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 33కు చేరింది. రష్యా బాంబుల వర్షం కురిపించి క్షిపణుల దాడులతో విరుచుకుపడడంతో 9 అంతస్థుల ఈ భవన సముదాయం చాలా భాగం ధ్వంసమైంది. సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉద్యోగులు విధులకు హాజరవుతున్న విషయం గమనించిన రష్యా.. దాడి చేయడానికి ముందు భవనంలోకి ఉద్యోగులు వచ్చే వరకు వేచి ఉండి.. ఆ తర్వాతే దాడి చేసిందని ప్రాంతీయ గవర్నర్ ఆరోపించారు.  

 

ఇవి కూడా చదవండి

యుద్ధంలో ఇప్పటి వరకు 158 మంది చిన్నారుల మృతి

ఛండీఘఢ్ను పంజాబ్కు ఎలా బదిలీ చేస్తారు?

వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు

ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి