మోడీపై బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ ప్రశంసల జల్లు

మోడీపై బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ ప్రశంసల జల్లు

లండన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ బిలియోరియా ప్రశంసలు కురిపించారు. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంలో ఆయన మోడీకి మద్దతుగా నిలిచారు. కరణ్ పార్లమెంట్ డిబేట్​లో మాట్లాడుతూ.. ‘భూమ్మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో మోడీ ఒకరు’ అని అన్నారు. ‘మోడీ చిన్నప్పుడు గుజరాత్ రైల్వే స్టేషన్​లో టీ అమ్మారు. ఇప్పుడు దేశ ప్రధానిగా ఈ భూమ్మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా ఎదిగారు’ అని ఆయన అన్నారు.

‘‘ఈరోజు ఇండియా జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలు చేపట్టింది. రానున్న 25 ఏండ్లలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకువెళ్తోంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ” అని కొనియాడారు. రానున్న కాలంలో ఇండియా దోస్తుగా, భాగస్వామిగా బ్రిటన్ ఉండాలని సూచించారు. ‘కరోనా టైమ్​లో బిలియన్ల కొద్దీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసింది’ అని చెప్పారు. కాగా, కరణ్ సొంతూరు హైదరాబాద్. ఆయన కుటుంబం గుజరాత్ నుంచి హైదరాబాద్​కు వలస వచ్చింది.