పువ్వులు అమ్మిన యూకే పీఎం రిషి

పువ్వులు అమ్మిన యూకే పీఎం రిషి

లండన్: యూకే ప్రధాని రిషి సునక్ పువ్వులు అమ్మి జనాన్ని ఆశ్చర్యపరిచారు. గురువారం లండన్​లోని వెస్ట్ మినిస్టర్ ట్యూబ్ స్టేషన్​లో ఆయన పువ్వులు అమ్మారు. ప్రధానమంత్రి రోడ్డుపై పూలమ్మడంతో జనం ఆశ్చర్యపో యారు. పేపర్​తో తయారైన గసగసాల మొక్కను(పాపీ) ఒక్కోదానిని ఐదు పౌండ్లకు విక్రయించారు.

రాయల్ బ్రిటిష్​ లీజన్ ఏటా లండన్ పాపీ డే పేరిట నిర్వహించే కార్యక్రమానికి నిధులు సేకరించేందుకు కొంతమంది వాలంటీర్లతో కలిసి రిషి పాపీలు అమ్మారు. ఈ సందర్భంగా జనం రిషితో కలిసి సెల్ఫీలు తీసుకొన్నారు. భారత మూలాలున్న ప్రధాని పాపీలు అమ్మారం టూ మరి కొంతమంది సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారు.